/rtv/media/media_files/2024/11/05/9I0JdicawYSHetQuoUwL.jpg)
Olympics : 2036 ఒలింపిక్స్ క్రీడలకు అతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇండియాలో 2036లో సమ్మర్ గేమ్స్ నిర్వహించేందుకు ఆసక్తిని కనబరుస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)కి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA)అధికారికంగా లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఐవోసీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించకపోగా పాజిటీవ్ గా స్పందించినట్లు కథనాలు వెలువడుతున్నాయి.
భారతదేశానికి ఇదొక ప్రధాన లక్ష్యం..
ఈ మేరకు ఉపఖండంలో ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం ఆసక్తిని వ్యక్తపరుస్తూ ఐవోసీకి ఐవోఏ అక్టోబర్ 1న లేఖను సమర్పించిన విషయం తెలిసిందే. దీంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ (FHC)తో 2036 సమ్మర్ గేమ్స్ ఆతిథ్య హక్కులను భారత్ పొందే దిశగా మొదటి దశ చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. అంతేకాదు.. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలనే భారత్ ఆకాంక్షను ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే నొక్కి చెబుతున్నారు. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. ఇది భారతదేశానికి ప్రధాన లక్ష్యమని, ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు. 2036 ఒలింపిక్స్‌కు సన్నద్ధం కావాలంటూ పిలుపునివ్వడం విశేషం.
ఇది కూడా చదవండి: Sharad Pawar: ఎన్నికల వేళ MVA కూటమికి బిగ్ షాక్.. పవార్ కీలక ప్రకటన!
140 కోట్ల భారతీయుల కల
‘ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ కోసం ఇండియన్స్ ఉత్సాహంగా ఎదరుచూస్తున్నారు. 140 కోట్ల భారతీయుల కల. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఏ విషయంలో వెనక్కి తగ్గం. 2029 యూత్ ఒలింపిక్స్‌ను సైతం నిర్వహించేందుకు మేము రెడీగా ఉన్నాం' అని మోదీ అన్నారు.
ఇది కూడా చదవండి: TG News: హైదరాబాద్‌లో దారుణం.. హైటెక్‌సిటీ పక్కనే గ్యాంగ్ రేప్
2025లో ఐఓసీ అధ్యక్ష ఎన్నికల తర్వాత..
ఇదిలా ఉంటే.. 2028 లాస్ ఏంజిలెస్, 2032 బ్రిస్బేన్ లో ఒలింపిక్స్ వేదికలు ఫిక్స్ చేశారు. ఈ క్రమంలోనే అందరి దృష్టి 2036పై ఉండగా.. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం భారత్ రేసులో ఉందని భారత ఒలింపిక్ కమిటీ గతంలో వెల్లడించింది. 2025లో ఐఓసీ అధ్యక్ష ఎన్నికల తర్వాత 2036 ఒలింపిక్స్ ఆతిథ్య దేశాన్ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి : క్రికెట్ కంటే కోహ్లీకి ఇష్టమైన ఆట ఏంటో తెలుసా?