Asian Champions Trophy:ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకున్న భారత్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని క్ష్మదోసారి భారత్ సొంతం చేసుకుంది. 1–0 తేడాతో టీమ్ హాకీ ఇండియా చైనా మీద గెలిసి విజయ పతాకం ఎగురవేసింది. హోరాహోరీగాసాగిన మ్యాచ్‌లో భారత జట్టు ఆద్భుతంగా ఆడింది. By Manogna alamuru 17 Sep 2024 | నవీకరించబడింది పై 17 Sep 2024 17:54 IST in స్పోర్ట్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Team India: చైనాలోని మోకి ట్రైనింగ్ బేస్ లోని హులున్‌బుయిర్‌లో జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు 1-0తో ఆతిథ్య జట్టు చైనాను ఓడించి…టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో భారత్ ఐదోసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. టోర్నీ ఆరంభం నుంచే టీమ్ ఇండియా పురుషుల జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తూ వచ్చింది.క్వార్టర్స్‌లో పాకిస్తాన్ జట్టును ఓడించి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్ళింది. అక్కడ కొరియా జట్టును 3–1 తేడాతో ఓడించి ఫైనల్‌లోకి అడుగు పెట్టింది. ఇక ఈరోజు జరిగిన టఫ్ మ్యాచ్‌లో 1–0 గోల్స్‌తో చైనా జట్టును డిఫీట్ చేసింది భారత టీమ్. ఈరోఉ జరిగిన ఫైనల్యా మ్యాచ్ మొదటి నుంచీ ఉత్కంఠ భరితంగా సాగింది. రెండు టీమ్‌లూ చాలా పట్టుదలగాగల్స్ కొట్టనివ్వకుండా ఆడాయి. అయితే చివర్లో పెనాల్టీ కార్నర్లో భారత ఆటగాళ్ళు గోల్ కొట్టడంతో మ్యాచ్ టీమ్ ఇండియా వశం అయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ ముందు ఉన్న మరో డిఫెండర్ జుగ్‌రాజ్‌కి అద్భుతమైన బంతిని అందించాడు మరియు జుగ్రాజ్ తన స్ట్రైక్‌ను చైనీస్ గోల్-సేవర్‌ను దాటించాడు. Also Read: JIO: ఒక్కసారిగా జియో డౌన్..సోషల్ మీడియాలో గగ్గోలు #hockey #asian-champions-trophy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి