ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో ఫైనల్స్‌కు భారత్ ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో టీమ్ ఇండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఈరోజు సెమీస్‌లో కొరియా మీద గెలిచి ఫైనల్స్‌లోకి దూసుకెళ్ళింది. ఫైనల్స్‌లో భారత టీమ్ చైనాతో తలపడింది. రేపు ఈ మ్యాచ్ జరగనుంది. By Manogna alamuru 16 Sep 2024 in స్పోర్ట్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Team India Entered In To Finals: హాకీ టీమ్ ఇండియా మంచి ఊపు మీద ఉంది. పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో కాంస్యాన్ని సాధించిన హాకీ జట్టు...ప్రస్తుతం జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ లో కూడా అదే ఊపు కొనసాగిస్తోంది. లీగ్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా..దూకుడుగా ఆడింది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచింది భారత్. తరువాత పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా గెలిచి సెమీస్‌కు చేరుకుంది. ఇక ఈరోజు దక్షిణ కొరియాతో జరిగిన సెమీస్‌లోనూ సత్తాచాటింది. హర్మన్‌ప్రీత్ సేన 4-1 తేడాతో కొరియాపై విజయం సాధించింది. భారత్ తరఫున ఉత్తమ్ సింగ్ , హర్మన్‌ప్రీత్ , జర్మన్‌ప్రీత్ సింగ్ లు గోల్స్ చేసి.. స్కోర్ చేశారు. కొరియా తరఫున నమోదైన ఏకైక గోల్‌ను జిహున్ యంగ్ 33వ నిమిషంలో సాధించాడు. సెప్టెంబర్ 17న అంటే రేపు చైనాతో ఫైనల్స్ మ్యాచ్‌లో భారత జట్టు తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ ఫైనల్‌కు చేరడం ఇది ఆరోసారి. ఇప్పటికే నాలుగు సార్లు విజేతగా నిలిచిన టీమ్‌ఇండియా ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించాలని చూస్తోంది. ప్రస్తుతం ఉన్న ఫామ్‌పరంగా చూస్తే ఫైనల్‌లో ఇండియానే ఫేవరేట్ అని చెప్పొచ్చు. భారత్ ఆడిన మ్యాచుల్లో చైనాపై 3-0, జపాన్‌పై 5-0, మలేసియాపై 8-1, కొరియాపై 3-1 తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. పాక్ రెండో స్థానంలో ఉంది. 2013 నుంచి పాక్‌తో ఆడిన 25 మ్యాచ్‌ల్లో భారత్ 16 గెలవగా.. పాక్ 5 విజయాలు సాధించింది. 4 మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి. ఇక గతేడాది ఆసియా క్రీడల్లో భారత్ 10-2తో పాక్‌ను చిత్తుగా ఓడించింది. Also Read: Hyderabad: ఖైరతాబాద్ గణేశుడి ఆదాయం 70 లక్షలు మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి