/rtv/media/media_files/2025/04/07/ffMnVc7xnBWmfYgqqq9m.jpg)
ishant-sharma
ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గుజరాత్ టైటాన్స్ పేసర్ ఇషాంత్ శర్మకు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించబడింది. ఆర్టికల్ 2.2 కింద నేరం కిందఅతని ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ కూడా జోడించింది. లెవల్ 1 ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు మ్యాచ్ రిఫరీ తుది నిర్ణయం ఉంటుంది. ఈ మ్యాచ్ లో ఇషాంత్ ఒక వికెట్ తీసుకోకుండా నాలుగు ఓవర్లలో 43 పరుగులు ఇచ్చాడు.అయితే శుభమన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచింది. మొత్తం ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో ఇషాంత్ శర్మ 97 పరుగులచ్చి ఒక వికెట్ కూడా తీయలేదు. కాగా ఐపీఎల్ మెగా వేలంలో ఇషాంత్ శర్మను గుజరాత్ టైటాన్స్75లక్షలకు కొనుగోలు చేసింది.
"Gujarat Titans’ Ishant Sharma handed 25 percent fine and one demerit point by IPL"
— Ramaswamy (@viswaguru1964) April 7, 2025
It is for an unexplained breach of code of conduct
I guess it is for bowling utter rubbish😂
Also Read : Fake Hair Growth : ఘరానా మోసగాడు.. బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ గుండ్లు కొట్టి పరార్!
సిరాజ్ అరుదైన రికార్డు
మహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ లో వంద వికెట్లు తీసిన 12వ బౌలర్ గా రికార్డు సృష్టించాడు. 97 ఐపీఎల్ మ్యాచ్ లలో సిరాజ్ ఈ ఘనత సాధించాడు. ఓవరాల్ గా ఐపీఎల్ లో వంద వికెట్లు తీసిన 26 బౌలర్ గా నిలిచాడు. సన్‌రైజర్స్ ఆటగాళ్లు.. ట్రావిస్ హెడ్ (8), అభిషేక్ శర్మ (18) లను ఔట్ చేయడం ద్వారా సిరాజ్ ఈ ఘనత అందుకున్నాడు.
Also Read: Vijay- Rashmika: ఒకేచోట విడివిడిగా ఫొటోలు.. ఇంకెన్ని రోజులు కొండన్న ఈ దాగుడు మూతలు!