Cricket: టీమ్ ఇండియా బౌలర్ బుమ్రా అరుదైన ఘనత

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఇండియాలో బంగ్లాదేశ్‌తో టెస్ట్ సీరీస్ ఆడుతోంది. ఈరోజు మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయింది. ఇందులో ఫాస్ట్ బౌలర్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి చేశాడు. భారత్ నుంచి ఈ ఘనత సాధించిన పదో బౌలర్‌‌గా బుమ్రా నిలిచాడు.

New Update
Bumrah: బుమ్రాతో పోలికా? సొంత జట్టు ఫ్యాన్స్‌కు ఇచ్చిపడేసిన పాకిస్థాన్‌ లెజెండ్!

Jaspreeth Bumrah: 

బంగ్లాదేశ్ తో చెన్నైలోని చిదంబర్ స్టేడియంలో జరుగుతున్న మొదటి మ్యాచ్లో టీమ్ ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో 227 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి 81 పరుగులు చేసి ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్లో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రికార్డ్ సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన భారత్‌ తరఫున 10వ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. అంతే కాకుండా.. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి చేసిన ఘనత సాధించిన ఆరో భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా నిలిచాడు. ఈ ఘనత సాధించిన భారత్‌ తరఫున 10వ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. హసన్ మహమూద్ ఔట్‌ చేసి బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. బుమ్రా కన్నా ముందు కపిల్ దేవ్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీలు ఉన్నారు. 

ఇక ఈరోజు జరుగుతున్న మ్యాచ్ విషయానికి వస్తే..మొదటి ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లలో 50 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. తొలి ఓవర్‌లోనే బంగ్లాదేశ్ ఓపెనర్ షాద్‌మన్ ఇస్లామ్‌ను బుమ్రా బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత ముష్ఫికర్ రహీమ్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్ వికెట్లు తీసి బంగ్లాదేశ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. 

Also Read: Stock Markets: ఒక్కరోజులో 6లక్షల కోట్లు..మార్కెట్ల సరికొత్త రికార్డ్

Advertisment
Advertisment
తాజా కథనాలు