MS Dhoni: ధోని హవా నడుస్తోంది.. యాడ్స్‌ అన్నీ మహీయే

మహేంద్ర సింగ్ దోనీ రోజుకు 16 గంటలపాటు  స్క్రీన్ మీద వివిధ యాడ్స్ లో కనిపిస్తున్నాడట. బాలీవుడ్ యాక్టర్లు, ప్రసెంట్ క్రికెటర్ల కంటే ఎక్కువ బ్రాండ్లకు దోని ప్రచారకర్తగా ఉన్నాడు. ట్రామ్ మీడియా రీసెర్చ్ ప్రకారం.. ఏకంగా 42 బ్రాండ్లకు క్యాపెనర్ గా ఉన్నాడు.

New Update
ads

మాజీ క్రికెటర్ మహీ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినా ఆయనకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ మహేంద్ర సింగ్ దోనీ రోజుకు 16 గంటలపాటు  స్క్రీన్ మీద వివిధ యాడ్స్ లో కనిపిస్తున్నాడట. బాలీవుడ్ యాక్టర్లు, ప్రసెంట్ క్రికెటర్ల కంటే ఎక్కువ బ్రాండ్లకు దోని ప్రచారకర్తగా ఉన్నాడు. ట్రామ్ మీడియా రీసెర్చ్ ప్రకారం.. ఏకంగా 42 బ్రాండ్లకు క్యాపెనర్ గా ఉన్నాడు. 2024 మొదటి ఆరునెలల్లో భారీ యాడ్లతో ఎక్కడ చూసినా ధోనీ కనిపిస్తూనే ఉన్నాడు.  ఐదేళ్ల కిందట ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్‌బై చెప్పాడు.

ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే ఆయన ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్ జట్టు కెప్టెన్ గా ఐపీఎల్ లో ఆడుతున్నాడు. టామ్ మీడియా రీసెర్చ్ ప్రకారం.. 42 బ్రాండ్లకు ప్రచారకర్తగా మహేంద్ర సింగ్ ధోని కొనసాగుతున్నారు. ఐపీఎల్ సీజన్ మళ్లీ మొదలవుతోంది కాబట్టి.. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

పెన్సీ, డ్రోన్ స్టార్టస్ గరుడ ఎయిరో స్పేస్, ఫ్లిప్ కార్ట్ కు చెందిన క్లియర్ ట్రిప్, మాస్టర్ కార్డ్, ఓరియంట్ ఎలక్ట్రిక్, గల్ఫ్ ఆయిల్, ఈమోటోరాడ్ వంటి బ్రాండ్లకు ప్రచరాకర్తగా ఉన్నాడు దోనీ.  మహీ లగ్జరీ కార్లు, కూల్ డ్రింక్స్ తోపాటు పలు బ్రాండ్లకు యాడ్స్ చేస్తున్నాడు.

ఇటీవల కాలంలో ఎన్నికలు, ఓటింగ్ పై కూడా ప్రజలకు అవగాహణ కల్పిస్తూ జార్ఖండ్ ఎలక్షన్లో ఎలక్షన్ కమిషన్ తో పనిచేశాడు. ధోని తర్వాత అమితాబ్ బచ్చన్ 41 బ్రాండ్లకు ప్రమోటర్ గా ఉన్నాడు. తర్వాత షారూ ఖాన్, అక్షయ్ కుమార్, సౌరభ్ సంగూలీ ఉన్నారు. విరాట్ కోహ్లీ 21 బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నాడు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు