DC vs SRH : ఉగాది రోజున ఊచకోత.. సన్‌రైజర్స్కు రెండో ఓటమి!

వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓటమిపాలైంది. 163 టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి 16 ఓవర్లనే మ్యాచ్ ను ఫినిష్ చేసింది.  

New Update
dc-vs-srh match

dc-vs-srh match

వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓటమిపాలైంది. 163 టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి 16 ఓవర్లనే మ్యాచ్ ను ఫినిష్ చేసింది.  డూప్లెసిస్‌(50) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా..  జేక్‌ ఫ్రెజర్‌(38), కేఎల్‌ రాహుల్‌(15) పరుగులు చేశారు. అభిషేక్‌ పోరెల్‌(34*), స్టబ్స్‌(21*) పరుగులు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో జీషన్‌ అన్సారీ ఒక్కడే మూడు వికెట్లు తీశాడు. దీంతో సన్‌రైజర్స్ జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురుకాగా... ఢిల్లీ జట్టు వరుసగా రెండో మ్యాచ్ గెలిచింది.  


163 పరుగులకు చాపచుట్టేసిన సన్‌రైజర్స్ 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ 163 పరుగులకు చాపచుట్టేసింది. యువ ఆటగాడు అనికేత్ వర్మ ఒక్కడే పర్వాలేదనిపించాడు. 41 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఇందులో ఐదు ఫోర్లు, ఆరు సిక్సులున్నాయి. అభిషేక్‌(1), ఇషాన్‌ కిషన్‌ (2),  నితీశ్‌కుమార్‌ రెడ్డి(0) విఫలమయ్యారు.  ట్రావిస్‌ హెడ్‌ (22),హెన్రిచ్ క్లాసెన్(32) పరుగులతో రాణించారు.   ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్  మిచెల్‌ స్టార్క్‌ ఐదు వికెట్లతో చెలరేగాడు.  3.4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో అదరగొట్టి రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు