స్మిత్ భరతం పడతా.. ఆసీస్ కు అశ్విన్ వార్నింగ్!

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీఫై భారత స్పిన్నర్ అశ్విన్ మైండ్ గేమ్ మొదలుపెట్టాడు. ఆసీస్ బ్యాట్స్ మెన్ స్టీవ్‌ స్మిత్‌కు కళ్లెం వేసేందుకు ప్లాన్ సిద్ధం చేసుకున్నానన్నాడు. స్మిత్ పై ఆధిపత్యం చేలాయిస్తానంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.  

author-image
By srinivas
New Update
DRER

Ind Vs Aus: బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీఫై భారత స్పిన్నర్ అశ్విన్ మైండ్ గేమ్ మొదలుపెట్టాడు. ఆసీస్ బ్యాట్స్ మెన్ స్టీవ్‌ స్మిత్‌కు కళ్లెం వేసేందుకు ప్లాన్ సిద్ధం చేసుకున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నవంబర్ 22నుంచి 5 టెస్టుల సిరీస్ మొదలుకానుండగా రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన అశ్విన్.. స్పిన్‌ బౌలింగ్‌ను బాగా ఆడే స్మిత్ ను కట్టడి చేసేందుకు తాను రెడీ ఉన్నట్లు తెలిపాడు. 

నెట్స్‌లో అతని బ్యాటింగ్‌ చూశా..

‘స్మిత్ ఫాస్ట్‌ బౌలింగ్‌ కూడా బాగా ఆడుతాడు. స్పిన్‌ లో మాత్రం అతని స్టైల్ భిన్నంగా ఉంటుంది. దీంతో అతణ్ని కట్టడి చేసేందుకు మార్గాలు కనుగొంటూనే ఉన్నా. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌కు కలిసి ఆడినప్పుడు నెట్స్‌లో అతని బ్యాటింగ్‌ చూశా. అతను ఎలా ప్రిపేర్ అవుతాడో చూశాను. అతనికి ఎలా బౌలింగ్‌ చేస్తే ఇష్టం ఉండదో తెలుసుకున్నా. స్మిత్ ఎప్పుడూ ఆధిపత్యం ప్రదర్శించాలనుకుంటాడు. నా బౌలింగ్‌లోనూ భారీ షాట్స్ ఆడాడు. అతని బ్యాటింగ్‌ శైలిని అర్థం చేసుకుని ఆధిపత్యం చెలాయిస్తా’ అంటూ చెప్పుకొచ్చాడు. 

ఇది కూడా చదవండి: Revanth Reddy: బాలల దినోత్సవం వేళ.. సీఎం రేవంత్ గుడ్‌న్యూస్‌

ఇదిలా ఉంటే.. కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో ఆసీస్‌ వెళ్లలేదు. తన భార్య రెండో కాన్పు నేపథ్యంలో భారత్‌లోనే ఉండాలని రోహిత్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా రోహిత్ ముంబైలో బ్యాటింగ్ ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

ఇది కూడా చదవండి: Srireddy: శ్రీరెడ్డి అరెస్ట్.. ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB VS RR: హుర్రే..ఓన్ గ్రౌండ్ లో ఆర్సీబీ గెలిచింది..ఆరఆర్ పై విక్టరీ

మొత్తానికి సొంతగడ్డపై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ గెలిచింది. ఐపీఎల్ 18 సీజన్ లో బెంగళూరు చినస్వామి స్టేడియంలో ఆర్సీబీ గెలవడం ఇదే మొదటిసారి. రాజస్థాన్ రాయల్స్ మీద ఆర్సీబీ 11 పరుగులు తేడాతో విజయం సాధించింది. 

New Update
ipl

RCB VS RR

ఐపీఎల్ లో ఈ రోజు ఆర్సీబీ, ఆర్ఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బెంగళూరు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 205 పరుగులు చేసి ఆర్ఆర్ కు 206 టార్గెట్ ఇచ్చింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులే చేసింది.  పరుగుల ఛేదనలో ఆర్ఆర్ తొమ్మిది వికెట్లను కోల్పోయింది. యశస్వీ జైస్వాల్‌ (49), ధ్రువ్‌ జురెల్‌ (47) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బెంగళూరు జట్టులో హేజిల్ వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 19వ ఓవర్లో కేవలం ఒక పరుగే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో లక్ష్యం 17 పరుగులు కాగా, యశ్‌ దయల్‌ వికెట్‌ తీసి కేవలం 5 పరుగులే ఇచ్చాడు. ఆర్సీబీలో హేజిల్‌ వుడ్‌ 4, కృనాల్‌ పాండ్య 2, భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ  20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 

ఎవరెన్ని కొట్టారంటే?

ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. అలాగే మ్యాచ్ ఆఖరి వరకు ఆడిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేశ్‌ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

కోహ్లీ పరుగుల వరద

32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్‌కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు. 

today-latest-news-in-telugu | IPL 2025 | rcb-vs-rr | match

Advertisment
Advertisment
Advertisment