Bumrah: ఆస్ట్రేలియా మీడియాలో భారత బౌలర్ జస్ప్రిల్ బుమ్రా నామస్మరణ మారుమోగుతోంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే బుమ్రా మేటి బౌలర్ అంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఆసీస్ ఆటగాళ్లు సైతం బుమ్రా బౌలింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అతని బౌలింగ్ లో బ్యాటింగ్ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని, తమ రాబోయే తరాలకు ఈ విషయం గొప్పగా చెబుతామంటూ తెగ పొగిడేస్తున్నారు. View this post on Instagram A post shared by JioNews (@jionews) Also Read: హరీష్ రావుకు బిగ్ షాక్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ వారెంట్!? బౌలింగ్ శైలి అంతుచిక్కట్లేదు.. ఈ మేరకు ఇటీవలే స్టార్ బ్యాట్ స్టీవ్ స్మిత్ బుమ్రా బౌలింగ్ లో ఎన్నిసార్లు ఆడినా సవాలుగా అనిపిస్తుందన్నాడు. బుమ్రా బౌలింగ్ శైలి అంతుచిక్కట్లేదని, కనురెప్పపాటులో బాల్ దూసుకొస్తుదంటూ తనదైన స్టైల్ లో అభినందించాడు. అయితే తాజాగా ప్రపంచ మేటి బ్యాటర్లలో ఒకడై ట్రావిస్ హెడ్ సైతం బుమ్రా బౌలింగ్ కు ఫిదా అయ్యాడు. బుమ్రా ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే మేటి ఫాస్ట్ బౌలర్. కెరీర్‌ను గొప్పగా ముగిస్తాడు. అతని బౌలింగ్ లో నేను బ్యాటింగ్ చేశానని నా మనవళ్లకు చెప్పుకుంటా అంటూ రీసెంట్ ఇంటర్య్వూలో చెప్పడం గమనార్హం. కాగా వీరిద్దరు కామెంట్స్ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ లవర్స్ కు కిక్ ఇస్తున్నాయి. Also Read: 'పుష్ప2' టికెట్ రేట్ల పెంపు కేసు.. హైకోర్టు సంచలన తీర్పు 📸 📸 𝙋𝙞𝙘𝙩𝙪𝙧𝙚 𝙋𝙚𝙧𝙛𝙚𝙘𝙩 𝙋𝙚𝙧𝙩𝙝 🥳Scorecard - https://t.co/gTqS3UPruo#TeamIndia | #AUSvIND pic.twitter.com/3ewM5O6DKs — BCCI (@BCCI) November 25, 2024 ఆస్ట్రేలియా ఆటగాళ్లే కాదు భారత మాజీలు సైతం పొగిడేస్తున్నారు. భారత మాజీ ఫాస్ట్‌బౌలర్, ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు కోచ్‌గా ఉన్న ఆశిశ్ నెహ్రా బుమ్రాను ప్రశంసించాడు. అతను ఐపీఎల్ వేలంలో బరిలోకి దిగితే జట్లకు రూ.520 కోట్ల పర్స్ ఉన్నా సరిపోదంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇక బోర్డర్-గావస్కర్ తొలి టెస్టులో 8 వికెట్లు పడగొట్టి భారత్ కు విజయాన్ని అందించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. Also Read: వీరనారి ఐలమ్మ గుర్తుగా.. త్వరలో మహిళా వర్సిటీ బిల్లు! Also Read: తెలంగాణ ప్రభుత్వ శాఖలో అవినితీ తిమింగలాలు.. రూ.500 కోట్ల స్కామ్