IND vs NZ: 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై.. 8 వికెట్ల తేడాతో కివీస్ విజయం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. 1988లో ముంబయిలోని వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో గెలిచిన కివీస్ మళ్లీ 36 ఏళ్ల తర్వాత భారత్ గడ్డపై విజయం సాధించింది. By Kusuma 20 Oct 2024 in స్పోర్ట్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి భారత్ జట్టుకి సొంతగడ్డపై ఓటమి ఎదురైంది. బెంగళూరు చిన్నస్వామి వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో కివీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐదో రోజు మ్యాచ్‌లో 107 పరుగుల టార్గెట్‌ను ఛేదించి కివీస్ అలవోకగా విజయం సాధించింది. దాదాపు 36 ఏళ్ల తర్వాత భారత్ గడ్డపై న్యూజిలాండ్ విజయం సాధించింది. ఇది కూడా చూడండి: టీతో సిగరెట్ తాగితే ఎంత ప్రమాదమో మీకు తెలుసా? రెండు వికెట్లు పడగొట్టిన భారత్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టిన.. కివీస్ జట్టు మరో వికెట్ పడనివ్వకుండా జాగ్రత్తపడ్డారు. ఓపెనర్లు ఔట్ అయినప్పటికీ విల్ యంగ్(48*), రచిన్ రవీంద్ర(39*) భారత్ జట్టుకు మూడో వికెట్ ఇవ్వలేదు. బుమ్రా రెండు వికెట్లు తీసిన మిగతా భారత్ పేసర్లు వికెట్లు తీయలేకపోయారు. ఇది కూడా చూడండి: ఇన్‌స్టాగ్రామ్ మోజులో పడి ప్రాణాలు తీసుకున్న వివాహిత.. ఏమైందో తెలుసా మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ ఓటమి పాలయ్యింది. ఇక రెండో టెస్ట్ మ్యాచ్ పూణె వేదికగా అక్టోబర్ 24న ప్రారంభం కానుంది. టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయిన మొదటి రోజు వరుణ దేవుడు ఆటంకం కలిగించాడు. దీంతో ఆ రోజు మ్యాచ్ ఆగిపోయింది. ఆ తర్వాత రోజు మ్యాచ్ జరిగిన భారత్ జట్టు 46 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇది కూడా చూడండి: శారదా పీఠానికి షాక్.. భూ కేటాయింపులు రద్దు భారత్‌పై న్యూజిలాండ్ టీమ్ 1988లో ముంబయిలోని వాంఖడే వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో చివరిగా గెలిచింది. 136 పరుగుల తేడాతో ఆ మ్యాచ్‌లో గెలిచిన కివీస్ జట్టు.. మళ్లీ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా భారత్‌పై విజయం సాధించలేదు. 36 ఏళ్ల నిరీక్షణ తర్వాత తొలి టెస్ట్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో అలవోకగా భారత్‌పై కివీస్ జట్టు విజయం సాధించింది. ఇది కూడా చూడండి: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీకొనడంతో ఇద్దరు స్పాడ్ డెడ్ #cricket #jaspreet-bumrah #ind-vs-nz మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి