Cricket: ఇలా ఆడేశారేంట్రా..సౌతాఫ్రికాపై శాంసన్, తిలక్ ఊచకోత సౌత్ ఆఫ్రికాలో తెలుగు అబ్బాయి తిలక్ వర్మ రెచిపోతున్నాడు. ఇతనికి ఇవాళ సంజూ శాంసన్ కూడా తోడయ్యాడు. ఇద్దరు బ్యాటర్లూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి సెంచరీలు బాదారు. ఒకరు 56 బంతుల్లో మరొకరు 74 బంతుల్లో సెంచరీలు చేశారు. By Manogna alamuru 15 Nov 2024 in స్పోర్ట్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి 4th T20 With South Africa: సౌతాఫ్రికాలోని జోహెన్నెస్ బర్గ్‌లో జరుగుతున్న నాలుగో టీ20లో భారత్ బ్యాటర్లు సంజూ శాంసన్, తిలక్ వర్మలు చెలరేగిపోయారు. అతిథ్య జట్టు సౌతాఫ్రికా బౌలర్ల మీద కనీస కనికరం చూపించలేదు. వారి బౌలింగ్ ను ఊచకోత కోస్తూ ఇద్దరూ మెరుపు సెంచరీలు బాదారు. సంజు శాంసన్, తిలక్ వర్మ పోటీ పడి మరీ స్టేడియంలో పరుగుల వరద పారించారు. సంజు శాంసన్ 56 బంతుల్లో 9 సిక్సర్లు, 6 ఫోర్లతో 111 పరుగులు చేయగా.. తిలక్ వర్మ 47 బంతుల్లో 10 సిక్సర్లు, 9 ఫోర్లు బాది 120 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఈ సెంచరీలతో సంజూ, తిలక్‌లు వరల్ట్ రికార్డ్ క్రియేట్ చేశారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో రెండో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడిగా సంజు శాంసన్, తిలక్ వర్మ ప్రపంచ రికార్డ్ సృష్టించారు. అంతకు ముందు కూడా ఈ రికార్డ్ పేరిటే ఉంది. 2022, జూన్ 28న ఐర్లాండ్‌పై భారత బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్, దీపక్ హుడా రెండో వికెట్‌కు 176 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. ఇప్పటి వరకు టీ20ల్లో సెకండ్ వికెట్‌కు ఇదే హ్యాయొస్ట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు ఈ రికార్డ్‌ను సంజు శాంసన్, తిలక్ వర్మ జోడి బద్దలు కొట్టింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 86 బంతుల్లోనే ఏకంగా 210 పరుగులు చేసి టీ20ల్లో రెండో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడిగా చరిత్ర సృష్టించారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సంజూ, తిలక్‌లు ఇద్దరూ వీర విహారం చేయడంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లో ఒక వికెట్ కోల్పోయి 283 పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికాకు ఇచ్చింది. Also Read: Railways: రీల్స్ చేస్తే జైలుకే..రైల్వే బోర్డు సీరియస్ డెసిషన్ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి