Arun Kumar Sinha: SPG డైరెక్టర్ జనరల్ అరుణ్‌ కుమార్ సిన్హా కన్నుమూత

ప్రధాని మోదీ భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(SPG) డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ సిన్హా (61) కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.

New Update
Arun Kumar Sinha: SPG డైరెక్టర్ జనరల్ అరుణ్‌ కుమార్ సిన్హా కన్నుమూత

Arun Kumar Sinha: ప్రధాని మోదీ భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(SPG) డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ సిన్హా (61) కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1987 కేరళ కేడర్ ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన సిన్హా ఆ రాష్ట్ర అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2016 నుంచి ఆయ‌న ఎస్పీజీ డైరెక్ట‌ర్‌గా పని చేస్తున్నారు.

1985లో ఎస్పీజీ ఏర్పాటు..

మాజీ ప్రధాని దివగంత ఇందిరాగాంధీని భద్రతా సిబ్బందే కాల్చి చంపిన నేపథ్యంలో 1985లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఎస్పీజీని ఏర్పాటుచేసింది. మాజీ ప్రధానులు, వారి కుటుంబ సభ్యులకు ఈ సంస్థ రక్షణ కల్పిస్తుంటుంది. అరుణ్ కుమార్ ఎస్పీజీ చీఫ్ గా రావడానికి ముందు 15 నెలల పాటు ఆ కీలక పదవి ఖాళీగా ఉంది. ఈ ఏడాది మే నెలలో ఎస్పీజీ డైరెక్టర్ జనరల్‌గా ఆయన పదోన్నతి పొందారు.

publive-image

కాలేయ సంబంధిత వ్యాధితో..

కొంతకాలంగా కాలేయ సంబంధిత అనారోగ్యంతో హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అరుణ్ కుమార్ చేరారు. అయితే ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఈ ఏడాది మే 30న ఎస్పీజీ చీఫ్‌గా పదవి విరమణ చేయాల్సి ఉండగా.. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆయన పదవి కాలం మరో ఏడాది పొడిగించింది ప్రస్తుతం ఆయన ప్రధాని మోదీ భద్రతా ఇంఛార్జ్‌గానూ వ్యవహరిస్తున్నారు.

Also Read: ఇండియా వర్సెస్ భారత్ చరిత్ర ఏంటి? రాజ్యాంగం ఏం చెబుతోంది?

Advertisment
Advertisment
తాజా కథనాలు