Food Safety : బయటి హోటళ్లలో తింటున్నారా .. అయితే జాగ్రత్త రంగారెడ్డి జిల్లా పరిధిలోని పలు హోటళ్లలో ఫుడ్ సెప్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పలు హోటళ్లలో పాడైపోయిన కూరగాయలు, ఆహార పదార్థాలతో ఆహారం తయారుచేస్తున్నట్లు గుర్తించారు. వాటి వివరాలు తెలుసుకునేందుకు ఈ ఫుల్ ఆర్టికల్ చదవండి. By B Aravind 27 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Out Side Food : మీరు బయట ఫుడ్ తింటున్నారా ? అయితే జాగ్రత్త. కొన్ని హోటళ్లు (Hotels), రెస్టారెంట్ల (Restaurants) లో పాచిపోయిన పదార్థాలతో ఫుడ్ అందిస్తున్నారు. ఎక్స్‌పైర్ డేట్ అయిపోయిన ఆహార పదార్థాలతో (Expiry Food) వండుతున్నారు. వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నారు. సింథటిక్ ఫుడ్ కలర్లు వినియోగిస్తున్నారు. శుభ్రతను పాటించడం లేదు. హైదరాబాద్‌లో ఇటీవల పలు హోటళ్లలో ఫుడ్ సేప్టీ అధికారులు (Food Safety Officials) తనిఖీలు చేయగా ఈ సంచలన నిజాలు బయటపడ్డాయి. రామేశ్వరం కేఫే, కరాచీ బెకరీ, కేఎఫ్‌సీ, రత్నదీప్ స్టోర్, క్రీమ్ స్టోన్, రోస్టరీ కాఫీ హౌస్ తదితర వాటిల్లో ఆరోగ్యానికి హానికరమైన ఆహారాన్ని అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే ఆదివారం కూడా రంగారెడ్డి జిల్లా పరిధిలోని పలు హోటళ్లలో ఫుడ్ సెప్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పలు హోటళ్లలో పాడైపోయిన కూరగాయలు, ఆహార పదార్థాలతో ఆహారం తయారుచేస్తున్నట్లు గుర్తించారు. ఆ హోటళ్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1.తాజా ఆల్ డే బ్రేక్‌ఫాస్ట్, మేడ్చల్ స్టోర్ రూంలో ఫుడ్ కలర్స్ లభించాయి పాడైపోయిన కూరగాయలు, నిమ్మకాయలు లభించాయి 2.. ట్రైన్ థీమ్ రెస్టారెంట్, కోంపల్లి క్యాలీ ఫ్లవర్, ఉల్లిపాయలు పాడైపోయాయి సింగ్‌లో వాటర్ బ్లాక్ అయ్యింది శాంపుల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపించాము 3. ప్రిసమ్ రెస్టారెంట్ అండ్ బార్, వట్టినాగులపల్లి ఎక్స్‌పైర్ డేట్ అయిపోయిన ఆహార పదార్థాలను అందిస్తున్నారు. స్టోర్ రూంలో ఎలుకల మలం లభించింది ఫ్రిజ్‌లో ఎక్కువ కాలం నిల్వఉంచిన కూరగాయల్లో నాణ్యత లేనట్లుగా గుర్తించాం వంట గదిలో నీరు నిలిచిపోయింది. దుర్వాసన వస్తోంది Special Teams have conducted inspections in Rangareddy district limits on 26.05.2024. 𝗧𝗮𝗮𝘇𝗮 𝗔𝗹𝗹 𝗗𝗮𝘆 𝗕𝗿𝗲𝗮𝗸𝗳𝗮𝘀𝘁, 𝗠𝗲𝗱𝗰𝗵𝗮𝗹 * Food colors found in store room discarded * Vegetables and Lemons of bad quality and unfit for consumption were discarded (1/4) pic.twitter.com/1t2Bnh4VMr — Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) May 27, 2024 Also Read : పిల్లల చర్మ సంరక్షణ విషయంలో ఈ తప్పులు చేయకండి..? ఇదిలా ఉండగా.. ఖమ్మంలోని బైపాస్ రోడ్డులో ఉన్న రెస్ట్ ఇన్ హోటల్‌లో కూడా ఫుడ్ అధికారులు తనిఖీలు చేశారు. అందులో నిల్వచేసిన చికిన చికెన్ ఐటెమ్స్‌ను గుర్తించారు. ఈ హోటల్‌లో చాలా రోజుల నుండి నిల్వ చేసిన ఆహారాన్ని వినియోగదారులకు అందిస్తు.. వంటకు ఉపయోగించే కొబ్బరి పొడి, నూడుల్స్ వంటి రా మెటీరియల్ కూడా కల్తీవే వాడుతున్నారు. హోటల్ సీజ్ చేస్తానని యాజమాన్యాని హెచ్చరించి.. నిల్వ ఉంచిన పలు చికెన్ కబాబ్ లను కాల్వలో వేయించారు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్. ఖమ్మం వాసులారా హోటల్స్‌లో తినే ముందు జాగ్రత్త ఖమ్మం హోటల్స్‌లో పట్టుబడ్డ నిల్వ చేసిన చికెన్ ఐటమ్స్.. మురికి కాల్వలో పడేసిన ఫుడ్ కంట్రోలర్ ఖమ్మం బైపాస్ రోడ్డులో ఉన్న రెస్ట్ ఇన్ హోటల్‌లో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ తనిఖీలు చేశారు. అయితే హోటల్‌లో చాలా రోజుల నుండి నిల్వ చేసిన… pic.twitter.com/duL5HkEZKv — Telugu Scribe (@TeluguScribe) May 27, 2024 #food-safety #adulterate #out-side-food మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి