Cancellation of Trains: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుపాను ఎఫెక్ట్‌.. 142 ట్రైన్స్ రద్దు..

142 రైళ్లను రద్దు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. మిచౌంగ్ తుపాను ప్రభావంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రద్దైన ట్రైన్ వివరాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

New Update
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు షాక్.. తెలంగాణ, ఏపీలో భారీగా రైళ్లు రద్దు.. వివరాలివే!

South Central Railways Trains Cancelled: తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రయాణికులకు అలర్ట్. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. 142 ట్రైన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రద్దైన ట్రైన్స్‌కు సంబంధించిన వివరాలను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. రద్దైన ట్రైన్స్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్లే రైళ్లు చాలానే ఉన్నాయి. మిచౌంగ్ తుపాను తీవ్రంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రైన్స్ క్యాన్సిల్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

రద్దైన ట్రైన్స్‌కి సంబంధించిన వివరాలు ఓసారి చూద్దాం...

🚂ట్రైన్ నెంబర్ - 07129 - సికింద్రాబాద్ - కొల్లాం - 03-12-2023

🚂ట్రైన్ నెంబర్ - 07130 - కొల్లాం - సికింద్రాబాద్ - 03-12-2023

🚂ట్రైన్ నెంబర్ - 12077 - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - విజయవాడ - 03-12-2023/04-12-2023

🚂ట్రైన్ నెంబర్ 12078 - విజయవాడ - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - 03-12-2023/04-12-2023

🚂ట్రైన్ నెంబర్ - 12603 - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - హైదరాబాద్ - 03-12-2023/04-12-2023/05-12-2023

🚂ట్రైన్ నెంబర్ - 12604 - హైదరాబాద్ - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - 04-12-2023/05-12-2023/06-12-2023/06-12-2023

🚂ట్రైన్ నెంబర్ - 12710 - సికింద్రాబాద్ - గూడుర్ - 03-12-2023/04-12-2023/05-12-2023

🚂ట్రైన్ నెంబర్ - 12709 - సికింద్రాబాద్ - గూడుర్ - 04-12-2023/05-12-2023

రద్దైన పూర్తి ట్రైన్స్‌కి సంబంధించిన వివరాలను కింద చూడొచ్చు..

తుపానుగా మారనున్న వాయుగుండం..

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. రానున్న 12 గంటల్లో ఇది తుపానుగా మారనుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని, తర్వాత దిశ మార్చుకొని ఉత్తర వాయువ్య దిశగా కదులుతుందని వివరించారు. దీని ప్రభావంతో తమిళనాడులో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు వాతావరణ కేంద్రం అధికారులు. చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయన్నారు. ఆదివారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో పలుచోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయన్నారు. తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ తుపాను డిసెంబర్ 4వ తేదీన నెల్లూరు మచిలీపట్నం, మధ్య దక్షిణ దిశలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ తుపాను ప్రభావం కోస్తాంధ్ర ప్రాంతంలోని అన్ని జిల్లాలపై ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

Also Read:

మందుబాబులకు షాక్.. తెలంగాణలో రేపు వైన్ షాప్‌లు బంద్..

మరో మూడేళ్లు కేసీఆర్ఏ సీఎం.. ట్విస్ట్ ఇచ్చిన ప్రముఖ జ్యోతిష్యుడు

Advertisment
Advertisment
తాజా కథనాలు