Indian Railways Alert: దీపావళికి ట్రైన్ లో ఉరెళ్తున్నరా?.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి!

రైళ్లలో సొంతూర్లకు వెళ్లేవారు వారి వెంట టపాసులు తీసుకుని వెళ్తే జరిమానా తో పాటు శిక్ష కూడా విధిస్తామని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే హెచ్చరికలు జారీ చేసింది.

New Update
Indian Railways Alert: దీపావళికి ట్రైన్ లో ఉరెళ్తున్నరా?.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి!

దీపావళి (Deepavali) పండుగ వస్తుందంటే చిన్న పిల్లలతో పాటు పెద్ద వారు కూడా ఎంతో ఆనందపడతారు. వయసుతో సంబంధం లేకుండా టపాసులు కాలుస్తూ ఎంతో సంతోషిస్తారు. దీపావళి పర్వదినం రాత్రి ఎక్కడ చూసినా పటాకులు పేలుతునే ఉంటాయి. పండుగ ఇంకా రెండు మూడు రోజులు ఉంది అనగానే యువకులు,పిల్లలు బాణసంచా తెచ్చి నిల్వ పెడుతుంటారు.

కొంత మంది అయితే సెలవుల నిమిత్తం ఊర్లకు వెళ్తూ తమ వెంట టపాసులు తీసుకుని వెళ్తుంటారు. అలా వెళ్లే వారు ఎక్కువగా బస్సు, ట్రైన్లనే (Train Journey) ఎక్కుతుంటారు. ఇలా టపాసులు తీసుకుని వెళ్లే వారికి సౌత్‌ సెంట్రల్‌ రైల్వే హెచ్చరికలు జారీ చేసింది. ట్రైన్లలో కానీ టపాసులు తీసుకుని వెళ్తే మాత్రం వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

Also read: నిండు సభలో సెక్స్ గురించి మాట్లాడిన నితీశ్ కుమార్!

ఒకవేళ దొంగతనంగా రైల్వే సిబ్బంది కళ్లు కప్పి కానీ తీసుకుని వెళ్తూ దొరికిపోతే కనుక...రైల్వే చట్టం 1989 సెక్షన్ 164, 165 ప్రకారం...జరిమానా (Fine)  లేదా మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే హెచ్చరించింది. కొన్ని సందర్భాల్లో నేరాన్ని బట్టి శిక్ష, జరిమానా రెండు కూడా ఉండే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు.

రైళ్లలో పేలుడు పదార్థాలు కానీ, అనుమానాస్పద వస్తువులు కానీ ఎవరైనా తీసుకుని వెళ్తున్నట్లు తెలిసినా, కనిపించినా వెంటనే రైల్వే హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 139 కి కాల్‌ చేసి తెలియజేయాల్సిందిగా ప్రయాణికులకు సూచించారు. గత కొంతకాలంగా ట్రైన్లలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే అధికారులు రైళ్లలో ప్రయాణించే వారికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సో...ట్రైన్‌ జర్నీ చేయాలనుకునే వారు ఈ విషయాలు తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి..కుటుంబ సభ్యులతో దీపావళి హ్యాపీగా చేసుకోండి.

Also read: బైక్‌ ని ఢీకొట్టిన కేంద్ర మంత్రి కారు..ఉపాధ్యాయుడు మృతి, విద్యార్థులకు తీవ్ర గాయాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఏం తమాషాలా.. గంటాపై టీడీపీ హైకమాండ్ సీరియస్!

మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ట్వీట్‍పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఏదైనా ఇబ్బంది ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేసింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కూడా మన పార్టీ వారే కదా అని గంటాని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

New Update

మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ట్వీట్‍పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఏపీలో విమాన సర్వీస్‍ల జాప్యంపై గంటా శ్రీనివాస్ నిన్న ట్వీట్ చేశారు. ఏపీ టూ ఏపీ వయా తెలంగాణ అంటూ ఆయన చేసిన ట్వీట్ తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో స్పందించిన టీడీపీ హైకమాండ్.. ఏదైనా ఇబ్బంది ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేసింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కూడా మన పార్టీ వారే కదా అని గంటాని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అలాంటప్పుడు రామ్మోహన్‍కి ఫోన్ చేయొచ్చు కదా..? అని ఫైర్ అయినట్లు సమాచారం. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృత్తం కావొద్దని గంటాకు టీడీపీ హై కమాండ్ స్పష్టం చేసినట్లు చర్చ సాగుతోంది. 

Advertisment
Advertisment
Advertisment