South central Railway: సంక్రాంతికి ఊరెళ్లలానుకుంటున్నారా..అయితే ఈ శుభవార్త మీకోసమే! సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లే వారికి సౌత్ సెంట్రల్ రైల్వే ఓ తీపి కబురు చెప్పింది. మరో 32 ప్రత్యేక రైళ్లను పండుగ సందర్భంగా నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. By Bhavana 02 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అతి పెద్ద పండుగ ఏదైనా ఉంది అంటే సంక్రాంతి (Sankranthi) నే. మరి కొద్ది రోజుల్లో ఈ పండుగ రాబోతుంది. దేశంలో ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వారంతా కూడా సొంతూర్లకు రావడానికి రెండు నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటుంటారు. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ఓ శుభవార్త చెప్పింది. ఇప్పటికే అన్ని రైళ్ల సీట్లలోని సీట్లన్ని నిండిపోయాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే మరోసారి వివిధ మార్గాల్లో 32 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. అది కూడా జనవరి 7 నుంచి జనవరి 27 వరకు మొత్తం 32 రైళ్లను నడపనున్నట్లు వివరించింది. వాటిలో ముఖ్యంగా హైదరాబాద్_కాకినాడ, సికింద్రాబాద్-నర్సాపూర్, హైదరాబాద్-కొచ్చువేలి, కాచిగూడ-భువనేశ్వర్, సికింద్రాబాద్- గూడూరు, సికింద్రాబాద్- తిరుపతి, శ్రీకాకుళం- వికారాబాద్ రూట్లలో ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు అన్నింటిలోనూ అందరికి అందుబాటులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ తో పాటు స్లీపర్, జనరల్ బోగీలు ఉండనున్నట్లు వివరించింది. సికింద్రాబాద్ నుంచి బ్రహ్మపూర్- జనవరి 7,14 తేదీల్లో ప్రత్యేక రైలు నడవనుంది. బ్రహ్మాపూర్ నుంచి వికారాబాద్ కి జనవరి 8, 15 తేదీల్లో ప్రత్యేక రైలు తిరుగుతుంది. వికారాబాద్ నుంచి బ్రహ్మాపూర్ జనవరి 9, 16 తేదీల్లో ప్రత్యేక రైలు నడవనుంది. విశాఖ - కర్నూలు సిటీ కి ప్రత్యేక రైలు జనవరి 10,17,24 తేదీల్లో నడవనుంది. కర్నూలు సిటీ నుంచి విశాఖపట్నం జనవరి 11,18, 25 తేదీల్లో , శ్రీకాకుళం నుంచి వికారాబాద్ జనవరి 12, 19, 26 తేదీల్లో, వికారాబాద్ నుంచి శ్రీకాకుళం జనవరి 13, 20, 27 తేదీల్లో , సికింద్రాబాద్ నుంచి తిరుపతి జనవరి 10, 17న, తిరుపతి నుంచి సికింద్రాబాద్ జనవరి 11, 18న , సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్ జనవరి 12న, కాకినాడ టౌన్ సికింద్రాబాద్ జనవరి 13 న, సికింద్రాబాద్ బ్రహ్మాపూర్ జనవరి 8, 15 న , బ్రహ్మాపూర్ సికింద్రాబాద్ జనవరి 9, 16న, నర్సాపూర్- సికింద్రాబాద్ జనవరి 10న, సికింద్రాబాద్- నర్సాపూర్ జనవరి 11న నడుస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. SCR to Run 32 Sankranti Special Trains @drmvijayawada @drmgnt @drmhyb @drmsecunderabad pic.twitter.com/IDex9T5iPf— South Central Railway (@SCRailwayIndia) January 2, 2024 Also read: పెళ్లి పీటలు ఎక్కనున్న డెవిల్ ముద్దుగుమ్మ..? #south-central-railway #special-trains #sankranti మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి