SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్..ప్రత్యేక సర్వీసులు పొడిగింపు..ఆ రైళ్లు..!

సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు ఓ శుభవార్త చెప్పింది.విజయవాడ డివిజన్‌లో ఆధునికీకరణ పనుల కారణంగా రద్దు చేసిన కొన్ని ముఖ్యమైన రైళ్లను పునరుద్ధరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొన్ని రైళ్లను పొడిగిస్తూన్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

New Update
Railways: 46 రైళ్ళల్లో 92 కొత్త జనరల్ కోచ్‌లు..రైల్వేశాఖ కీలక నిర్ణయం

South Central Railway: సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు ఓ శుభవార్త చెప్పింది. విజయవాడ (Vijayawada) డివిజన్‌లో ఆధునికీకరణ పనుల కారణంగా రద్దు చేసిన రైళ్లు కొన్ని ముఖ్యమైన రైళ్లను పునరుద్ధరిస్తూ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ నుంచి లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్ (Janmabhumi Express 12805/12806), విజయవాడ - కాకినాడ పోర్ట్ (17257), చెంగల్పట్టు -కాకినాడ పోర్ట్ (17643) రైళ్లను మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 25 నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ యథావిధిగా నడవనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.

కాగా, నిడదవోలు - కడియం మధ్య ఆధునికీకరణ పనుల కారణంగా ఈ నెల 23 నుంచి ఆగస్ట్ 11 వరకూ పలు రైళ్లను ఇటీవల రద్దు చేసినట్లు రైల్వే అధికారులు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిల్లో ముఖ్యమైన జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్ ప్రెస్ వంటి సర్వీసులు ఉండగా.. ప్రయాణికుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. ప్రత్యామ్నాయ సర్వీసులు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. ఈ క్రమంలో రైళ్లను పునరుద్ధరిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. అటు, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొన్ని రైళ్లను పొడిగిస్తూన్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

ప్రస్తుతం నడుస్తోన్న రైళ్లను మరో 2 నెలల పాటు పొడిగించారు. తిరుపతి - అకోల, అకోల - తిరుపతి , పూర్ణ - తిరుపతి , తిరుపతి - పూర్ణ , హైదరాబాద్ - నర్సాపూర్, నర్సాపూర్ - హైదరాబాద్ రైళ్లను పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, సికింద్రాబాద్ - తిరుపతి ), తిరుపతి - సికింద్రాబాద్ , కాకినాడ టౌన్ - లింగంపల్లి , లింగంపల్లి - కాకినాడ సర్వీసులను అక్టోబర్ వరకూ పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.

Also Read: బాలరాముడి గర్భగుడిలోకి వర్షం నీరు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: 45 రోజుల పాటు VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ

TTD 45రోజుల పాటు VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో మే1 - జూన్ 15 వరకు ఎమ్మెల్యే,ఎంపీ, ప్రముఖుల సిఫార్సులపై జారీచేసే బ్రేక్ దర్శనాలను క్యాన్సిల్ చేసింది. ప్రొటోకాల్ పరిధి ప్రముఖులు స్వయంగా వస్తే బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనుంది.

New Update
TTD cancels VIP break darshans for 45 days

TTD cancels VIP break darshans for 45 days

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 45 రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. వేసవి సెలవులు ప్రారంభం అయ్యియి. దీంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 

Also Read: పహల్గాం దాడిని పూర్తిగా షూట్‌ చేసిన వీడియోగ్రాఫర్‌.. కానీ

మే1 నుంచి రద్దు

ఇందులో భాగంగా మే 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర ప్రముఖుల సిఫార్సులపై జారీ చేసే బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. అదే సమయంలో కేవలం ప్రొటోకాల్ పరిధిలో ఉన్న ప్రముఖులు స్వయంగా వస్తేనే బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనుంది. ఈ మేరకు మే 1వ తేదీ నుంచి ఉదయం 6 గంటలకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది. 

Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?

ఒక్కరోజే 82,811 మంది భక్తులు

ఇదిలా ఉంటే TTDలో టోకెన్లు లేని భక్తులకు దాదాపు 18 గంటల సమయం పైనే పడుతోంది. కేవలం ఒక్క శనివారం రోజే భారీగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు. సుమారు 82,811 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదే సమయంలో 34,913 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కేవలం ఆ ఒక్క రోజే రూ.3.24 కోట్లు శ్రీవారి హుండీ ఆదాయం వచ్చింది. 

Also Read: పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు

Also read: కాంగ్రెస్ వాళ్లను ఉరికిచ్చి కొడతా... ఎర్రబెల్లి దయాకర్ రావు ఫుల్ ఫైర్

telugu-news | ttd | latest-telugu-news | tirumala tirupati temple

Advertisment
Advertisment
Advertisment