South Africa: టెస్టుల్లో దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు.. అత్యధిక సిరీస్‌లు నెగ్గిన టీమ్‌గా! టెస్టు క్రికెట్‌లో దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు సృష్టించింది. విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో విజయంతో వరుసగా ఒకే జట్టు(వెస్టిండీస్)పై 10 సిరీస్‌లు గెలిచిన జట్టుగా అవతరించింది. సౌతాప్రికా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా కేశవ్ మహరాజ్ నిలిచాడు. By srinivas 18 Aug 2024 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి South Africa: టెస్టు క్రికెట్‌లో దక్షిణాఫ్రికా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. విండీస్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో విజయం సాధించిన సౌతాఫ్రికా.. ఒక జట్టుపై వరుసగా అత్యధికంగా 10 సిరీస్‌లు నెగ్గిన టీమ్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతకుముందు ఈ రికార్డు టీమ్‌ఇండియా (9), ఆస్ట్రేలియా (9) పేరిట ఉండగా.. ఇప్పుడు పది సిరీస్ లతో దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో నిలిచింది. Winning is what we do! 🇿🇦 South Africa’s test series win yesterday was the 10th consecutive win against the West Indies! ✨ The Proteas made us so proud with an incredible team effort and clinical bowling when it mattered! 👏 Well done once again.#WozaNawe #BePartOfIt#SAvWI pic.twitter.com/bwniEGNyo3 — Proteas Men (@ProteasMenCSA) August 18, 2024 ఈ మేరకు వెస్టిండీస్, దక్షిణాఫ్రికా ఇప్పటివరకు 33 టెస్టుల్లో తలపడగా.. దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. ఇరుజట్ల మధ్య 1992లో జరిగిన ఏకైక టెస్టులో సౌతాఫ్రికా ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన 10 సిరీస్‌లను కైవసం చేసుకుని విండీస్‌పై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇక దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. సౌతాప్రికా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా నిలిచాడు. హ్యూ టేఫీల్డ్ (170) వికెట్ల రికార్డును కేశవ్ బ్రేక్ చేశాడు. ఈ సిరీస్ లో 13 వికెట్లు తీసిన కేశవ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకున్నాడు. Maharaj the record breaker! ✨🥳 Keshav is the new most successful South African spinner. A record previously held by Hugh Tayfield is broken.💥#WozaNawe #BePartOfIt#SAvWI pic.twitter.com/bZvoyls18T — Proteas Men (@ProteasMenCSA) August 18, 2024 #south-africa #westindies #test-cricket మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి