Zee-Sony: జీ-సోనీల వేల కోట్ల డీల్ రద్దు సోనీ-జీ విలీన ఒప్పందం ముగిసిపోయింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో $10 బిలియన్ల ఒప్పందాన్ని రద్దు చేసినట్లు సోనీ ధృవీకరించింది. అనుకున్న గడువులోపు ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి రాలేకపోవంతో దాదాపు రూ.83వేల కోట్ల విలువైన ఒప్పదం రద్దు అయినట్లు తెలిపారు. By srinivas 22 Jan 2024 in బిజినెస్ ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Zee-Sony Merger: సోనీ-జీ విలీన ఒప్పందం ముగిసిపోయింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో $10 బిలియన్ల ఒప్పందాన్ని రద్దు చేసినట్లు సోనీ ధృవీకరించింది. Zee ఎంటర్‌టైన్‌మెంట్‌కు టెర్మినేషన్ నోటీసును అందజేసినట్లు సోనీ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ విలీన ప్రక్రియ పూర్తికి పొడిగించిన గడువు 2024 జనవరి 21తో ముగిసినట్లు తెలిపింది. అయితే అనుకున్న గడువులోపు ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి రాలేకపోవంతో.. 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ.83,000 కోట్ల) విలువైన ఒప్పండం రద్దు అయింది. రెండేళ్ల కాలవ్యవధి.. ఈ మేరకు విలీన ఒప్పందంపై (Zee-Sony Merger) జీ ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా 2021లో సంతకాలు చేశాయి. ఈ లావాదేవీ పూర్తికి రెండేళ్ల కాలవ్యవధి నిర్దేశించుకోగా.. ఈ గడువు 2023 డిసెంబరు 21తో ముగియనుంది. దీంతో అదనంగా మరో నెల రోజులు పొడిగించాయి. అయినప్పటికీ.. విలీనం దిశగా ఏకాభిప్రాయం కుదరకపోవటంతో.. ఇప్పటికే సీసీఐ, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ, వాటాదారుల ఆమోదం పొందిన ఈ విలీన ఒప్పందం క్యాన్సిల్ అయింది. 2021లో కుదిరిన ఒప్పందం ప్రకారం.. కొత్తగా ఏర్పాటయ్యే విలీన (Zee-Sony Merger) సంస్థను జీ ఎండీ, సీఈఓ పునీత్ గోయెంకా నడిపించాల్సి ఉంది. అయితే నిధుల మళ్లింపు కేసులో జీ, ఇతర సంస్థల్లో కీలక పదవులు చేపట్టకుండా పునీత్‌పై సెబీ నిషేధం విధించింది. ఇది కూడా చదవండి : TSRTC: హే రేవంత్.. యే క్యా హువా! బస్సుల్లో మహిళలు ఈ పనులు కూడా చేస్తున్నారే! సోనీ అభ్యంతరాలు.. ఈ నేపథ్యంలో పునీత్ నాయకత్వంపై సోనీ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. సెబీ ఆదేశాలపై సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (శాట్) స్టే విధించినా, పునీత్ విషయంలో సోనీ సుముఖంగా లేదని, ఇందుకు జపాన్‌లో కఠినమైన కార్పొరేట్ విధానాలే కారణమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పునీత్ గోయెంకా స్థానంలో సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ అధిపతి ఎన్‌పీ సింగ్‌ను నియమించాలని కల్వర్ మ్యాక్స్ ఒత్తిడి చేసినట్లు సమాచారం. #cancel #sony-zee #deal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి