Sonia Gandhi on Modi: మోదీ నైతికంగా ఓడిపోయారు.. ప్రధానిపై విరుచుకుపడిన సోనియాగాంధీ 

ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ నైతికంగా ఓడిపోయారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ రాష్ట్రాల్లో మైనారిటీల ఇళ్లపై బులోడ్జర్లు నడుపుతున్నారని ఆరోపించారు. నీట్‌పై మౌనంగా ఎందుకున్నారంటూ ప్రధాని మోదీని సోనియా గాంధీ నిలదీశారు. 

New Update
Sonia Gandhi on Modi: మోదీ నైతికంగా ఓడిపోయారు.. ప్రధానిపై విరుచుకుపడిన సోనియాగాంధీ 

Sonia Gandhi on Modi: కాంగ్రెస్ సీనియర్ అధినేత్రి సోనియా గాంధీ ఒక ఆర్టికల్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన తక్కువ స్థానాలే ప్రధాని మోదీ ఓటమికి నిదర్శనమని ఆమె అన్నారు. బీజేపీకి తక్కువ సీట్లు రావడం రాజకీయంగా, నైతికంగా ప్రధాని ఓటమి అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది కాకుండా, బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో, మైనారిటీల ఇళ్లపై బుల్డోజర్లు నడుపుతున్నారని ఆమె ఆరోపించారు. 

Sonia Gandhi on Modi: 2024 ఎన్నికల్లో ప్రధాని వ్యక్తిగతంగా, రాజకీయంగా, నైతికంగా ఓటమి చవిచూశారని సోనియా గాంధీ ఓ జాతీయ వార్తాపత్రికకు రాసిన ఆర్టికల్ లో పేర్కొన్నారు. తనను తాను దైవిక శక్తిగా ప్రకటించుకున్న ప్రధానికి, ఈ ఎన్నికల ఫలితం ఆయన ద్వేషపూరిత రాజకీయాలను ప్రజలు తిరస్కరించి నట్టు స్పష్టం చేసింది అన్నారు. అంతే కాదు, 1975లో ఎమర్జెన్సీ విధించిన తర్వాత 1977లో జరిగిన ఎన్నికలను కూడా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రస్తావిస్తూ సామాన్య ప్రజలు ఎలా తీర్పు ఇచ్చారో చెప్పారు. 1977 మార్చిలో ఎమర్జెన్సీ విధింపుపై దేశ ప్రజలు తీర్పు ఇచ్చారని, అప్పటి ప్రభుత్వాన్ని ఆమోదించారని అన్నారు. మేము 1977 నిర్ణయాన్ని ఎటువంటి సంకోచం లేకుండా అంగీకరించాము, అందుకే 1980లో మోడీకి ఎన్నడూ సాధించడానికి సాధ్యం కాని  మెజారిటీతో తిరిగి వచ్చాము అని సోనియా చెప్పారు. 

నీట్‌పై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు?
Sonia Gandhi on Modi: ప్రధాని ఎమర్జెన్సీని ప్రస్తావించారని సోనియా గాంధీ అన్నారు. ఆశ్చర్యకరంగా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దృష్టి మరల్చారు. ప్రధానమంత్రి ఎప్పుడూ ఏకాభిప్రాయం గురించి మాట్లాడతారు, కానీ ఘర్షణ మార్గాన్ని అవలంబిస్తారు. స్పీకర్ ఎన్నికల్లో ప్రభుత్వం మద్దతివ్వాలని కోరగా.. సంప్రదాయం ప్రకారం వైస్‌స్పీకర్‌ పదవి విపక్షాలకే దక్కాలని చెప్పామని, అయితే మా డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించలేదన్నారు.

Also Read: తెలంగాణ రాజకీయాలపై పవన్ సంచలన ప్రకటన

Sonia Gandhi on Modi: గత లోక్ సభ హయాంలో చర్చ లేకుండా చట్టాలు చేసిన ఎంపీలందరినీ సస్పెండ్ చేశారన్నారు. ప్రధానమంత్రి పరీక్షలపై చర్చిస్తున్నారు, కానీ నీట్‌పై మౌనంగా ఉన్నారు. మరోవైపు దేశంలోని మైనారిటీలపై హింస, బెదిరింపు కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో కేవలం ఆరోపణలపైనే మైనారిటీల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రధాని తన పదవికి గౌరవం లేకుండా అబద్ధాలు చెప్పి మతతత్వ వ్యాఖ్యలు చేశారు.

మణిపూర్‌లో పర్యటించేందుకు ప్రధాని మోదీకి సమయం దొరకలేదా?
Sonia Gandhi on Modi: మణిపూర్ హింసాకాండను కూడా కాంగ్రెస్ నేత ప్రస్తావించారు. “మణిపూర్ మండుతూనే ఉందని, అయితే అక్కడికి వెళ్లేందుకు ప్రధానికి సమయం దొరకడం లేదన్నారు. 400 దాటాలన్న ప్రధాని నినాదాన్ని ప్రజలు తిరస్కరించారు. దీనిపై వారు స్వీయ విశ్లేషణ చేసుకోవాలి.” అంటూ సోనియా గాంధీ తన ఆర్టికల్ లో ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vidadala Rajini : మాజీమంత్రికి బిగ్ షాక్....మరిది అరెస్ట్

మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత విడుదల రజనికి బిగ్ షాక్ తగిలింది. ఆమె మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.హైదరాబాద్ లో ఆయన్ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు విజయవాడకు తరలించారు. క్వారీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని గోపీపై కేసు నమోదైంది.

New Update
Vidadala Rajini

Vidadala Rajini

Vidadala Rajini: మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత విడుదల రజనికి బిగ్ షాక్ తగిలింది. ఆమె మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో ఆయన్ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.. విజయవాడకు తరలిస్తున్నారు. యడ్లపాడు కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని రజినితోపాటు గోపీపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే అతడ్ని ఏసీబీ అధికారులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి: ఈ పండ్లు తింటే క్యాన్సర్‌ పరార్.. ఆ అద్భుతమైన ఆహారాలు ఇవే


గోపిని  ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విడదల గోపినాథ్ ను అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చి ఏపీకి తీసుకెళ్లారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకున్న ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ.. తాజాగా అరెస్ట్ చేసింది.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ
 
కాగా.. మాజీ మంత్రి విడదల రజనిపై ఏసీబీ ఈ ఏడాది మార్చిలో కేసు నమోదు అయింది. 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమ్యాన్నాని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారని అభియోగాలు ఉన్నాయి. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని ఆమెపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో విడదల రజనీపై కేసు నమోదు చేశారు. ఆమెను ఈ కేసులో ఏ1గా చేర్చారు ఏసీబీ అధికారులు. ఏ2గా ఐపీఎస్ అధికారి జాషువా పై కేసు నమోదు చేశారు. ఏ3గా గోపి, ఏ4గా రజనీ పీఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చింది. విడదల రజని వాటా 2 కోట్లు ఇచ్చినట్టు కేసు నమోదు చేయగా.. ఆమె మరిది గోపి, జాషువాలకు చెరో 10 లక్షలు ఇచ్చినట్లు కేసు నమోదు చేశారు.

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

Advertisment
Advertisment
Advertisment