Vangaveeti VS Bonda: సోషల్ మీడియా వేదిక వంగవీటి..బోండా వర్గీయుల వార్! విజయవాడ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా వంగవీటి రాధా, బోండా ఉమా వర్గీయుల మధ్య పెద్ద యుద్దమే నడుస్తుంది. By Bhavana 24 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Vangaveeti VS Bonda : ఏపీలో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న రాష్ట్రంలోని ప్రధాన పార్టీల వర్గీయుల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఇప్పటికే పార్టీల్లోని అసంతృప్తి నేతలందరూ కూడా జంపింగ్ జంపాంగ్ లుగా మారారు. బెజవాడ (Vijayawada) రాజకీయాలకు పెట్టింది పేరు. బెజవాడ లో వంగవీటి రాధా (Vangaveeti radha) , బోండా ఉమా (Bonda uma) వర్గాల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్దమే నడుస్తుంది. గతకొంత కాలం నుంచి టీడీపీ సెంట్రల్ సీటు విషయంలో రాధా ఉమా వర్గీయులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వంగవీటి రాధాను టీడీపీ నమ్మడం లేదంటూ 3 రోజుల క్రితం సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ గా మారాయి. అయితే ఈ పోస్టులు బోండా ఉమా వర్గీయులే చేసి ఉంటారని రాధా వర్గం అనుమానించి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో బోండా ఉమా టార్గెట్ గా కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కౌంటర్ లాంటి ఎన్ కౌంటర్... తాజాగా ఉమా టార్గెట్ గా సోషల్ మీడియాలో కౌంటర్ లాంటి ఎన్ కౌంటర్ పోస్టులు పోస్ట్ అయ్యి వైరల్ గా మారాయి. ఈ పనిని రాధా వర్గీయులే చేసి ఉంటారని బోండా ఉమా వర్గం ఆరోపిస్తుంది. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో బోండా ఉమా టార్గెట్ గా కొన్ని ప్రశ్నలను సంధించారు. అందులో వంగవీటి రాధాను పార్టీ నమ్మాలంటే ఏం చేయాలి..? పదవులు కోసం పార్టీని బెదిరించాలా? చిన్న పిల్లల చావుకి కారణం అవ్వాలా? దేవుడి పేరుతో చందాలు పోగెయ్యాలా? కార్పొరేటర్ టికెట్లు అమ్ముకోవాలా లేక పదవి రాకపోతే కాపుల గొంతుకోశారంటూ..పార్టీకి కులానికి మధ్య విరోధం పెంచాలా ? ఈసారి టికెట్ రాదని అధికారంలో ఉన్న పార్టీతో చర్చలు జరపాలా..అలా చేస్తేనే పార్టీ నమ్ముతుందా? అంటూ ఉమాను టార్గెట్ చేసుకుని పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వంగవీటి రాధా పై ఏడు పాయింట్లతో పోస్టులు పెడితే పదిహేడు పాయింట్లతో ఉమా పై పోస్టులు చేయడం సోషల్ మీడియాలో కనిపిస్తుంది. Also read: ప్రజాప్రతినిధులే ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి.. సొంతపార్టీ పైనే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు! #vijayawada #tdp #politics #bonda-uma #vangaveeti-radha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి