Kurchi Thatha: పాపం.. సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటున్న కుర్చీ తాత.. వీడియో వైరల్ 'కుర్చీ తాత'కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఆయన ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కుంటూ కనిపించాడు. దీంతో ఈ వీడియోను చూసిన నెటిజన్స్ 'కుర్చీ తాతకు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరం అని కామెంట్స్ చేస్తూ.. వీడియోను నెట్టింట షేర్ చేస్తున్నారు. By Anil Kumar 30 Jul 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Kurchi Thatha : సోషల్ మీడియాని ఫాలో అయ్యే వాళ్లందరికీ 'కుర్చీ తాత' తెలిసే ఉంటుంది. 'కుర్చీ మడతపెట్టి' అనే ఒకే ఒక డైలాగ్ తో సోషల్ మీడియాని షేక్ చేశాడు. ఈయన డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందంటే.. ఏకంగా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో ఈయన డైలాగ్ తో పాటని క్రియేట్ చేసేంతలా! త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమాలో కుర్చీ మడత పెట్టి సాంగ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇక ఈ సాంగ్ తర్వాత కుర్చీ తాత సెలబ్రిటీ అయిపోయాడు. 'గుంటూరు కారం' సాంగ్ తన డైలాగ్ ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వచ్చి తాతను పిలిపించి మరీ ఆర్థిక సాయం అందించారు. అయితే ఈ తాతకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఆయన ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కుంటూ కనిపించాడు. దీంతో ఈ వీడియోను చూసిన నెటిజన్స్ 'కుర్చీ తాతకు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరం అని కామెంట్స్ చేస్తూ.. వీడియోను నెట్టింట షేర్ చేస్తున్నారు. https://rtvlive.com/wp-content/uploads/2024/07/An8jhMb1eMPsjXmS7W0ayMtEjX-_OmAka7cUfQP8M6kc53G9Pq02We94BXJ2btRsBP_Yc-x6O7Vkbj2ggwTjYxch.mp4" poster="https://rtvlive.com/wp-content/uploads/2024/07/FotoJet-40-9.jpg"> Also Read : బర్త్ డే స్పెషల్.. ఖరీదైన కారు కొన్న బాలీవుడ్ స్టార్, ఎన్ని కోట్లో తెలుసా? ఇక కుర్చీ తాత అసలు పేరు షేక్ అహ్మద్ పాషా. హైదరాబాద్‌లో కృష్ణ కాంత్ పార్క్ వద్ద ఉంటాడు. ఇతనికి భార్య, కొడుకులు, కూతురు ఉన్నారు. అయితే ఇంట్లో వాళ్లని పట్టించుకోకుండా ఇలా రోడ్లపైనే తిరుగుతూ ఉంటాడు. అయితే మధ్యలో యూట్యూబ్ ఛానల్లో ఈయన ఇంటర్వ్యూ బాగా వైరల్ అయింది. అక్కడితో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. #kurchi-thatha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి