Barrelakka: తగ్గేదేలే అంటున్న 'బర్రెలక్క'.. ఎమ్మెల్యేగా నామినేషన్..

బర్రెలక్కగా సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన శిరీష.. కొల్లపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తోంది. బుధవారం నాడు ఉదయం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. నిరుద్యోగులు, ప్రజల సమస్యలపై పోరాడేందుకే తాను నామినేషన్ వేసినట్లు శిరీష్ చెప్పింది.

New Update
Barrelakka: తగ్గేదేలే అంటున్న 'బర్రెలక్క'.. ఎమ్మెల్యేగా నామినేషన్..

Barrelakka Contest as MLA: ఇన్‌స్టాగ్రమ్‌లో ఎంతో మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. కానీ.. ప్రిన్సెస్ సిరి(princes_siri_barrelakka)కి ఉన్న క్రేజే వేరు. పక్కా తెలంగాణ మాండలికంలో మాట్లాడుతూ.. తన ఊరి ముచ్చట్లను సోషల్ మీడియాలో నెటిజన్స్‌తో పంచుకుంటూ ఎంతో ఫేమస్ అయ్యింది. నిరుద్యోగం కారణంగా బర్రెలు కాస్తున్నా ఫ్రెండ్స్ అని ఒక్క వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసి.. సోషల్ మీడియాలో ఓవర్‌నైట్ ఫేమస్ అయిపోయింది. అలా అందరినోట బర్రెలక్కగా గుర్తింపు పొందిన సిరి అలియాస్ శిరీష.. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు నామినేషన్ కూడా దాఖలు చేసింది శిరీష.

తెలంగాణలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై శిరీష వీడియోస్ చేసి ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసేది. అలా క్రమంగా ఆమె ఫేమస్ అయ్యింది. ఈ క్రమంలోనే శిరీష.. నిరుద్యోగుల తరఫున పోరాడటం కోసం కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. ప్రజలు, విద్యార్థుల సమస్యలపై పోరాడేందుకు తాను ఎన్నికల బరిలో నిలుస్తున్నానని శిరీష పేర్కొంది.

బుధవారం ఉదయం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది శిరీష. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ప్రజల సమస్యలపై పోరాటానికే పోటీకి సిద్ధమైనట్లు చెప్పింది. ప్రజలకు ఇవ్వడానికి తనవద్ద డబ్బులు లేవని, ప్రచారం చేసేంత సమయం కూడా లేదని పేర్కొంది. అందుకే సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో ప్రచారం మొదలు పెట్టింది శరీష అలియాస్ బర్రెలక్క. కాగా, శిరీష స్పూర్తిని మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. యువత రాజకీయాల్లోకి రావాలని, ఆమె మరింత సక్సెస్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నారు.

కాగా, కొల్లాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా బీఆర్ఎస్ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పోటీ చేస్తున్నారు. వీరిద్దరినీ ఢీకొడతానంటూ శిరీష ఇవాళ నామినేషన్ దాఖలు చేసింది.

Also Read:

అలా చేస్తే నా నిర్ణయం నేను తీసుకుంటా: హైకమాండ్ కు జగ్గారెడ్డి ఫోన్

ఒకవేళ హంగ్ వస్తే తెలంగాణ లో పరిస్థితి ఏంటి? పార్టీల ప్లాన్ బీ ఎలా ఉంటుంది?

Advertisment
Advertisment
తాజా కథనాలు