Snake Eating Girl : అబ్బా.. మనిషా.. రాక్షసా.. బతికున్న పామును చెరుగ్గడలా నమిలేస్తోంది!

పాములు, తేళ్లు వంటి వాటిని వండుకుని తినే దేశాల ప్రజలు ఉన్నారని మనకు తెలుసు. కానీ, బతికున్న పామును పరపరా నమిలేసే వారున్నారని తెలీదు కదా. వినడానికే ఒళ్ళు జలదరించేలా ఉన్న ఈ విషయం వీడియోలో చూస్తే ఇదిగో ఇలా వైరల్ అవుతుంది.. ఈ ఆర్టికల్ లో ఆ వీడియో ఏమిటో చూసేయండి. 

New Update
Snake Eating Girl : అబ్బా.. మనిషా.. రాక్షసా.. బతికున్న పామును చెరుగ్గడలా నమిలేస్తోంది!

Snake Eating Girl Video Viral :  పాము (Snake) ను చూస్తే మనం జడుసుకుని ఛస్తాం. చూడగానే పారిపోతాం. లేదా చంపేయాలని కర్ర కోసం వెతుక్కుంటాం. ఆఫ్ కోర్స్ కొందరు నాగదేవత అని దణ్ణం పెట్టి ప్రార్ధనలూ చేస్తారనుకోండి. కానీ, పాములను ఒక ప్లేట్ లో పెట్టుకుని.. కూరగాయలు తిన్నట్టుగా ఇంకా చెప్పాలంటే చెరుగ్గడ నమిలినట్టుగా  పర పరా నమిలేసే వారు కనిపిస్తే ఏమనిపిస్తుంది. చెబుతుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది కదూ. ఇదిగో దక్షిణ కొరియా (South Korea) కు చెందిన ఓ వయ్యారి అదే పని చేస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Snake Eating Girl :  అవును.. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో దక్షిణ కొరియాకు చెందిన ఓ అమ్మాయి పామును కూరగాయల్లా తింటున్న దృశ్యం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌లో @asmrmukbangworld షేర్ చేశారు. ఈ వీడియోలో, ఒక దక్షిణ కొరియా అమ్మాయి కూరగాయలతో పాటు తన ముందు ప్లేట్‌లో పాములను ఉంచుకుంది. ఆమె చేతిలో పామును పట్టుకుని తినడం ప్రారంభించింది. ఒకసారి ఆమె పాము తల- తోక  మధ్య భాగాన్ని కొరికి తింటోంది. ఈ వీడియో ఇప్పటికే 15 మిలియన్లకు పైగా వ్యూస్ అలాగే ఒక మిలియన్ కంటే ఎక్కువ లైక్‌లను పొందింది. 

Snake Eating Girl : ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రమే షాక్‌కు గురై రకరకాలుగా రియాక్షన్‌లు ఇస్తున్నారు. 'మనం భారతదేశం (India) లో పుట్టడం చాలా బాగుంది' అని ఓ నెటిజన్  తనను తాను ఓదార్చుకున్నారు. మరొకరు, 'చైనీస్ ప్రజలు సంతృప్తి చెందడానికి వీటిని తింటారు. కానీ వారి ఈ కొత్త డైట్‌తో ప్రపంచానికి కొత్త వైరస్‌లు వస్తున్నాయి' అని విమర్శిస్తూ వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే వీడియో వైరల్ అవడం మాట అటుంచి అసలు ఆ వీడియో చూడటానికే చాలా జుగుప్సాకరంగా అనిపిస్తోంది. అయినా.. వైరల్ వీడియో (Viral Video) కదా.. మీరు కూడా ఇక్కడ దానిని చూసేయండి. 

Also Read : రెండు రైళ్లు ఢీ.. ఐదుగురు మృతి.. 200 మందికి గాయాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు