Smart Watch: స్మార్ట్ వాచ్‌తో మన శరీరంలోకి వైరస్‌లు..జాగ్రత్త స్మార్ట్ వాచ్ అనేది ఇప్పుడు అందరూ ధరిస్తున్నారు. స్టైల్ కోసమో లేక స్టేటస్ కోసమో ధరిస్తున్నారు తప్ప దాని వల్ల కలిగే అనర్థాల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. ఎన్నో రకాల వైరస్‌లు మన శరీరంపై దాడి చేస్తాయి. అంతేకాక ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 20 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి స్మార్ట్ వాచ్..ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఇది భాగమైపోయింది. 24 గంటల పాటు మన చేతికి ఇది అంటిపెట్టుకుని ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్‌లో ఉపయోగించే సాంకేతికత శరీరంలో ఆక్సిజన్ స్థాయిలతో పాటు కేలరీలను కొలుస్తుంది. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ అధ్యయనం ప్రకారం ఈ స్మార్ట్ వాచ్‌లు మన ఆరోగ్యానికి హానికరం అని తేలింది. ఒకప్పుడు ముళ్లు ఉన్న గడియారాల స్థానంలో ఇప్పుడు అన్నీ డిజిటల్ స్మార్ట్ వాచ్‌లు వచ్చాయి. దీని ద్వారా ఎన్నో పనులు జరుగుతున్నాయి. స్మార్ట్ వాచ్‌ను మొబైల్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఫోన్ లాగానే ఈ వాచ్‌లలో కూడా కొన్ని ముఖ్యమైన అప్లికేషన్‌లు ఉంటాయి. స్మార్ట్‌వాచ్‌లు బ్లూటూత్, GPS, హార్ట్ రేట్ మానిటర్, యాక్టివిటీ ట్రాకర్‌లాంటి ఉపయోగకరమైన ఫీచర్‌లతో అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌వాచ్‌ల వల్ల అనర్థాలు: స్మార్ట్‌వాచ్‌ల వల్ల చాలా ఉపయోగాలున్నప్పటికీ మితిమీరిన వినియోగం శరీరానికి ప్రమాదకరం. స్మార్ట్ వాచ్ ఎక్కువగా వాడటం వల్ల కొన్ని ప్రమాదకరమైన వైరస్‌లు మనకు తెలియకుండానే శరీరంలోకి ప్రవేశిస్తాయి. ప్రేగులు, రక్తం, ఊపిరితిత్తులలోకి ప్రవేశించడం ద్వారా అవి శరీరాన్ని బలహీనపరుస్తాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయని అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా తరచుగా జలుబు దగ్గు, జ్వరం, విరేచనాలు, ప్రేగు సంబంధిత వ్యాధులకు కారణమవుతుందని ఒక పరిశోధనలో తేలింది. వైరస్‌లు ఎలా దాడి చేస్తాయి?: స్మార్ట్‌వాచ్‌ల కోసం ఉపయోగించే బ్యాండ్ ప్లాస్టిక్‌తో తయారు చేయబడింది. ఈ రిస్ట్ బ్యాండ్‌పై దుమ్ము, కాలుష్యం ద్వారా అనేక రకాల వైరస్‌లు తిష్టవేసుకుని కూర్చుంటాయి.అవి మనశరీరంలోకి పోతాయని అంటున్నారు. స్మార్ట్‌వాచ్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే ఈ వైరస్‌లు శరీరంలోకి వెళ్తాయి. స్మార్ట్ వాచీలే కాదు, మొబైల్స్, ఇయర్ ఫోన్స్, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, కంప్యూటర్లు, కెమెరాలు, బైనాక్యులర్లు ఇలాంటి పరికరాల్లో కూడా బ్యాక్టీరియాలు అధికంగా ఉంటాయని చెబుతున్నారు. ఎలా క్లీన్ చేసుకోవాలి?: అందుకే ఎలక్ట్రానిక్ పరికరాలను ఎప్పటకప్పుడు శుభ్రం చేసుకోవాలి. మార్కెట్లో లభించే క్రిమిసంహారక స్ప్రేలను వాడటం వల్ల 99 శాతం వైరస్‌లను నాశనం చేయవచ్చు. ఇది కూడా చదవండి: క్లీనింగ్‌కు రసాయనాలు వాడుతున్నారా..జాగ్రత్త గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-tips #smart-watch #smart-watch-side-effects మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి