Skin Care: మీ ముఖం చంద్రుడిలా మెరిసిపోవాలంటే ఈ చిట్కా ట్రై చేయండి! మష్రూమ్ ఫేస్ మాస్క్‌తో ముఖాన్ని అందంగా, మెరిసేలా మార్చుకోవచ్చు. దీనికోసం పుట్టగొడుగులను కడిగి రుబ్బుకోవాలి. అందులో తేనె, పెరుగు కలిపి ముఖంపై 20 నుంచి 30 నిమిషాల పాటు అప్లై చేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. తర్వాత మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. By Vijaya Nimma 27 Aug 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Skin Care: పుట్టగొడుగులతో ఫేస్ ప్యాక్.. వినటానికి వింతగా ఉన్నా... అందం మాత్రం రెట్టింపు అవుతుంది. పుట్టగొడుగులు మనందరికీ తెలిసినవే. వీటితో చేసిన వంటకాలు, బిర్యాని కూడా ఎంతో రుచిగా ఉంటుంది. మీరు మీ ముఖాన్ని అందంగా మార్చుకోవాలనే ఆందోళనలో ఉంటే పుట్టగొడుగులను ఉపయోగించవచ్చు. అయితే పుట్టగొడుగులతో రుచికరమైన వంటలే కాకుండా అందాన్ని కూడా రెట్టిపు చేసుకోవచ్చట. దీనిని ఫేస్ ప్యాస్‌గా వేసుకుంటే ముఖం మీద ఉన్న ముడతలు, మొటిమలు, మచ్చలు, ట్యాన్ వంటివి తొలగిపోవడంతోపాటు ముఖం చంద్రుడిలా మెరిసిపోతుంది. ఈ పుట్టగొడుగులతో ఫేస్ ప్యాక్‌ను ఎలా వేసుకోవాలో ఈ విషయలపై కొన్ని చిట్కాలు ఆర్టికల్‌లో తెలుసుకుందాం. చర్మ సంరక్షణకు పుట్టగొడుగులతో ఫేస్ మాస్క్: పుట్టగొడుగులతో ముఖాన్ని అందంగా, మెరిసేలా మార్చుకోవచ్చు. పుట్టగొడుగులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు చర్మాన్ని నిర్విషీకరణ చేసి డెడ్ స్కిన్ తొలగించడంలో సహాయపడతాయి. మష్రూమ్ ఫేస్ మాస్క్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీని కోసం మొదట పుట్టగొడుగులను బాగా కడిగి రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులో తేనె, పెరుగు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై 20 నుంచి 30 నిమిషాల పాటు అప్లై చేసి ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. ముఖం కడిగిన తర్వాత మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. పుట్టగొడుగులలో ఉండే పోషకాలు చర్మాన్ని బిగుతుగా చేసి ముడతలను తగ్గిస్తాయి. మష్రూమ్‌తో తయారు చేసిన ఫేస్ మాస్క్‌ను వారానికి 2 నుంచి 3 సార్లు ఉపయోగించవచ్చు. మష్రూమ్ ఫేస్ మాస్క్‌ని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయాలని గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే కొంతమందికి దీనికి అలెర్జీ వచ్చే అవకాశం ఉంటుందని చర్మ నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: బీపీ, గుండె జబ్బులు ఉంటే.. ఈ రకమైన ఉప్పు తీసుకోండి! #skin-care మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి