Ayodhya : అయోధ్య రామయ్యకు సిరిసిల్ల బంగారు చీరె సిరిసిల్ల చేనేతకు అరుదైన గౌరవం దక్కనుంది. ఈ నెల 22న అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట జరగనుండగా.. 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండితో హరిప్రసాద్ తయారు చేసిన చీర శ్రీ రాముడి పాదాల చెంత ఉంచనున్నారు. ఈ చీరను 26న ప్రధాని మోడీకి అందించనున్నారు. By srinivas 18 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Sircilla : సిరిసిల్ల(Sircilla) చేనేతకు మరో అరుదైన గౌరవం దక్కింది. అయోధ్య(Ayodhya) లో కోలువుతీరనున్న శ్రీరామచంద్రుడి పాదాల చెంత సిరిసిల్లలో తయారు చేసిన బంగారు చీరను ఉంచనున్నారు. ఈమేరకు సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్(Hari Prasad) తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీరెను ఈనెల 26న ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అందించనున్నారు. రాముడి పాదాల చెంత.. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ(PM Modi) చేతుల మీదుగా రాముడి పాదాల చెంత చీరె చేరనుండగా హరిప్రసాద్ తయారు చేసిన చీరెను బండి సంజయ్(Bandi Sanjay) పరిశీలించారు. చీరె(Saree) లోనే రామాయణ ఇతివృత్తానికి సంబంధించిన చిత్రాలు పొందుపరిచిన తీరును బండి సంజయ్ కొనియాడుతూ హరిప్రసాద్ ను అభినందించారు. ఈరోజు సాయంత్రం సిరిసిల్లలోని హరిప్రసాద్ నివాసానికి వెళ్లిన సంజయ్.. హరి ప్రసాద్ స్వయాన తయారు చేసిన బంగారు చీరెను పరిశీలించి మురిసిపోయారు. శ్రీరాముడి చిత్రంతోపాటు రామాయణ ఇతివృత్తాన్ని తెలియజేసే చిత్రాలను సైతం ఆ చీరెలో పొందుపర్చడం విశేషంగా పేర్కొంటూ హరిప్రసాద్ శాలువాతో సత్కరించారు. ఇది కూడా చదవండి : Twinkle: 50 ఏళ్లకు డిగ్రీ పట్టా..హీరో భార్యపై నెట్టింట ప్రశంసలు 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండి.. అలాగే 8 గ్రాముల బంగారం(Gold), 20 గ్రాముల వెండితో తయారు చేసిన చీర అందరినీ అబ్బురపరిచేలా ఉందని బండి సంజయ్ అన్నారు. 'ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ స్వయాన తన చేతులతో తయారు చేసిన బంగారు చీరె చాలా బాగుంది. ఈనెల 26న ప్రధానికి చీరెను అందించనున్నాం. ప్రధాని చేతుల మీదుగా శ్రీరాముడి పాదాల చెంతను ఉంచేందుకు సిద్ధమవడం సంతోషంగా ఉంది. గతంలో అగ్గిపెట్టెలా చీరెను ఉంచిన చరిత్ర సిరిసిల్ల జిల్లాకు ఉంది. ఇంతటి గొప్ప నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేనేత కార్మికులను ఆదుకునేందుకు నా వంతు కృషి చేస్తా' అని సంజయ్ హమీ ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) లోని అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట ఈ నెల 22న జరగనుంది. #ayodhya #sircilla #ayodhhya-ram-mandir #gold-saree మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి