Trisha : సుచీ లీక్స్.. ఆ వీడియోల వెనక త్రిష హస్తం - వెలుగులోకి సంచలన నిజాలు!

కోలీవుడ్ లో మరోసారి సుచీ లీక్స్ గోల మొదలైంది. సింగర్ సుచిత్ర మరోసారి తాజాగా వీటిని గురించి ప్రస్తావిస్తూ సుచీ లీక్స్ పేరుతో లీక్ అయిన వీడియోల వెనక త్రిష, చిన్మయి ఇద్దరి పాత్ర కీలకం అని, వాళ్ళకి తప్పకుండా నా ఉసురు తగులుతుందని సంచలన వ్యాఖ్యలు చేసింది.

New Update
Trisha : సుచీ లీక్స్.. ఆ వీడియోల వెనక త్రిష హస్తం - వెలుగులోకి సంచలన నిజాలు!

Singer Suchitra Shocking Comments On Trisha : కోలీవుడ్ లో మరోసారి సుచీ లీక్స్ గోల మొదలైంది. సుచీ లీక్స్ పేరుతో అప్పట్లో సెక్స్ వీడియోలు, హీరో, హీరోయిన్ల ఎఫైర్స్ కి సంబంధించి పలు రహస్యాలు బయటికి రావడంతో సినీ పరిశ్రమలో అవి పెను సంచనాలు సృష్టించాయి. సింగర్ సుచిత్ర మరోసారి తాజాగా వీటిని గురించి ప్రస్తావిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ముఖ్యంగా ధనుష్ భార్య గురించి చెబుతూ తనకు ఎఫైర్స్ తప్ప పిల్లల్ని చూసుకోవడంపై శ్రద్ధ ఉండదని వ్యాఖ్యానించింది. అంతేకాదు హీరోయిన్ త్రిష, తన మాజీ భర్త, ధనుష్ లపై ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

Also Read : చేతికి గాయంతో కనిపించిన ఐశ్వర్య రాయ్.. ఆందోళనలో అభిమానులు?

ఆ వీడియోల వెనక త్రిష హస్తం

సుచీ లీక్స్ పేరుతో లీక్ అయిన వీడియోల వెనక త్రిష, చిన్మయి ఇద్దరి పాత్ర కీలకం అని, వాళ్ళకి తప్పకుండా నా ఉసురు తగులుతుందని తాజా ఇంటర్వ్యూలో చెప్పింది సుచిత్ర. అంతేకాకుండా మీకు బయటికి కనిపించే త్రిష వేరు, నిజమైన త్రిష వేరని, సుచీ లీక్స్ అనేవి ఓ ప్రాంక్ లాగా స్టార్ట్ చేస్తే అది ఆన్ లైన్ లోకి రావడానికి కారణం త్రిష, చిన్మయి అంటూ తెలిపింది. దీంతో సుచిత్ర చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె కామెంట్స్ విన్న నెటిజన్స్ సుచీ లీక్స్ వ్యవహారంలో త్రిష హస్తం ఉందని తెలిసి షాక్ అవుతున్నారు.

ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న ఆ సంఘటనను సుచిత్ర మళ్ళీ బయటికి తీసి త్రిషపై నింద మోపడంతో ఇది కాస్త ఆమె కెరీర్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడిప్పుడే త్రిషకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఓ వైపు తమిళ్ సినిమాలు చేస్తూనే మరోవైపు ఇతర భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇలాంటి టైం లో త్రిషపై సుచిత్ర చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. 'హిట్ 3' ట్రైలర్ ట్రెండింగ్ .. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

నేచురల్ స్టార్ నాని హిట్ 3 ట్రైలర్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 23.1 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. RRR, బాహుబలి సినిమాల కంటే ఎక్కువ వ్యూస్ తో అంచనాలను అమాంతం పెంచేస్తోంది.

New Update


బాహుబలి, RRR రికార్డులు బద్దలు 

హిట్ 3 ట్రైలర్ 24 గంటల్లో 23మిలియన్ల వీక్షణాలను సంచలనాత్మక రికార్డు సృష్టించింది. RRR, బాహుబలి రికార్డులను సైతం బీట్ చేసి.. యూట్యూబ్ లో నెంబర్ 1 ట్రెండింగ్ గా కొనసాగుతోంది.  ఆకర్షణీయమైన కథనం,  మైండ్-బ్లోయింగ్ యాక్షన్ షాట్‌లతో ట్రైలర్  ఆసక్తికరంగా  ఉంది. నాని  స్క్రీన్ ప్రెజెన్స్ భయానకంగా, మునుపెన్నడూ చూడని విధంగా కనిపించింది. భయంకరమైన పోలీస్ అధికారిగా అదరగొట్టారు నాని.  'హిట్3' మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read: Indian Film Pyre: ఇమాజిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో 'పైర్' చిత్రానికి ఏకంగా 6 విభాగాల్లోనామినేషన్

ఇదిలా ఉంటే.. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకోగా.. బోర్డు నుంచి 18+ సర్టిఫికెట్ పొందింది. కొన్ని సన్నివేశాల్లో బూతులు, రక్తపాతం, వాయిలెన్స్ ఉండడం వల్ల 18+ సర్టిఫికెట్ వచ్చింది. పిల్లలు, సున్నితమైన స్వభావం కలవారు ఈ చిత్రానికి దూరంగా ఉండాలి.  శైలేష్ కొలను దర్శకత్వం వహించిన  ఈ మూవీలో శ్రీనిధి శెట్టి కథనాయికగా నటించగా.. రావు రమేష్, బ్రహ్మాజీ, సూర్య శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

telugu-news | latest-news | cinema-news

Also Read: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

Advertisment
Advertisment