Morning Tips : ఉదయం బద్ధకంగా పడుకుంటున్నారా.. ఈ టిప్స్ తో మీ బద్ధకానికి చెక్..!

చాలా మంది ఉదయాన్నే నిద్ర లేవడానికి బద్దకిస్తూ ఉంటారు. కానీ ఉదయాన్నే నిద్ర లేస్తే రోజంతా కూడా ప్రొడక్టివ్ గా ఉంటుందని అందరికీ తెలుసు కానీ బద్ధకం. త్వరగా నిద్రలేవడానికి ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు. అలారమ్ బెడ్ కి దూరంగా ఉంచడం, ఫోన్ చూడడం, కాఫీ తాగడం మానేయాలి.

New Update
Morning Tips : ఉదయం బద్ధకంగా పడుకుంటున్నారా.. ఈ టిప్స్ తో మీ బద్ధకానికి చెక్..!

Wakeup Tips : ఉదయాన్నే మేల్కోవడం అంటే అతి కష్టమైన పనిగా భావిస్తారు కొంత మంది. మరి కొంతమంది త్వరగా నిద్ర లేవలని అలారమ్ సెట్ చేసుకొని పడుకుంటారు. కానీ ఉదయాన్నే మళ్ళీ అదే బద్ధకం చూపిస్తారు. ఇవన్నీ కాదు మీరు త్వరగా నిద్ర లేవాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి చాలు.

ఉదయాన్నే  నిద్ర లేవడానికి టిప్స్

  • ఉదయాన్నే నిద్ర లేచే అలవాటు(Morning Tips) చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఈ అలవాటు ఒక్క రోజులో అయితే వచ్చేది కాదు. కొన్ని రోజుల పాటు మన శరీరం మన రోజూ దినచర్యకు అలవాటు పడాలి. సడెన్ గా అలవాట్లను మార్చుకోవాలంటే చాలా కష్టం. అందుకని మెల్లి మెల్లి గా మీరు పడుకునే సమయాన్ని అడ్జెస్ట్ చేసుకోవాలి. రోజు 15 నిమిషాలు ముందుగా మీరు పడుకునే, నిద్ర లేచి సమయాన్ని అడ్జెస్ట్ చేసుకోండి. మెల్లి మెల్లిగా ఇలా చేస్తే మీ దినచర్య పూర్తిగా మారిపోతుంది.
  • చాలా మంది త్వరగా నిద్రలేవాలి అనే పట్టుదలతో పక్కనే అలారమ్ పెట్టుకొని మరీ పడుకుంటారు. కానీ ఉదయం అది మోగగానే సింపుల్ గా స్నూజ్ బటన్ నొక్కేసి మళ్ళీ పడుకుంటారు. అందుకని రాత్రి పడుకునే ముందు పక్కనే ఉంచకుండ.. రూమ్ లో ఎక్కడైన దూరంగా ఉంచాలి. దాని వల్ల అది మోగినప్పుడు బెడ్ పై నుంచి లేచి స్టాప్ చేస్తారు. దాంతో మళ్ళీ పడుకునే అవకాశం ఉండదు.
  • రాత్రి సమయంలో పడుకునే ముందు కాఫీ లేదా కెఫిన్ ప్రాడక్ట్స్ తాగడం, తినడం చేయకూడదు(Healthy Foods). దాని వల్ల రాత్రిళ్ళు నిద్రలేమి సమస్య వస్తుంది. దాంతో ఉదయం నిద్ర లేవడానికి ఇబ్బందిగా ఉంటుంది.
  • ఉదయాన్నే త్వరగా నిద్రలేవాలి అంటే పడుకునే ముందు ఫోన్స్ అస్సలు చూడకూడదు. వాటి నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రకు అవసరమయ్యే మెలటోనిన్ ఉత్పత్తి పై ప్రభావం చూపును.

publive-image

  • ప్రతీ రోజు పడుకునే ముందు బుక్ చదవడం, ఏదైనా రిలాక్సింగ్ టెక్నీక్స్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే రోజూ అదే సమయానికి నిద్ర పోవాలనే సిగ్నల్ మన శరీరానికి వస్తుంది.
  • మీ దినచర్య ఖచ్చితంగా ఉండేలా ప్లాన్ చేసుకోండి. ప్రతీ రోజు ఒకే సమయానికి నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే రోజంతా మన శరీరం ఇంకా బ్రెయిన్ కూడా చురుకుగా పని చేస్తాయి.
  • ప్రతీ రోజు రాత్రి పడుకునే ముందు ఏదో ఒక గోల్ తో పెట్టుకొని పడుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే వ్యాయామం చేయడం, హెల్తీ ఫుడ్ తీసుకోవడం, యోగా చేసుకోవడం ఇలా ఏదైనా కావచ్చు

Also Read: Diabetes: మధుమేహం ఉన్నవారు వాకింగ్ చేస్తే ఏమవుతుంది..?

Advertisment
Advertisment
తాజా కథనాలు