Beauty Tips: బ్లాక్ హెడ్స్ సింపుల్‌గా తొలగించే చిట్కాలు మనిషి నిత్యం అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ముఖం తెల్లగా రావడానికి ఎన్నో క్రీములు వాడుతారు, ఎంతో కేర్ తీసుకుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ముఖంపై మొటిమలు, చిన్న చిన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఎంతో చికాకు పెడుతుంటాయి. ఎన్ని క్రీములు వాడినా ప్రయోజనం అయితే ఉండదు. By Vijaya Nimma 03 Nov 2023 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Beauty Tips: ఈ చిన్న చిట్కాతో సులభంగా మన ముఖంపైన ఉండే బ్లాక్, వైట్ హెడ్స్‌ను తొలగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ మంది బ్లాక్ హెడ్స్ సమస్యతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బ్లాక్ హెడ్స్ ఎక్కువ శాతం గడ్డం, ముక్కు, నుదుటిపై వస్తుంటాయి. వీటివల్ల ఎలాంటి ఆరోగ్య నష్టం లేకపోయినా మన ముఖం అందం కోల్పోయి కనిపిస్తుంది. మన ఫేస్‌ను సరిగా కడుక్కోకపోవటం, చర్మంపై మట్టి చేరడం, డెడ్ స్కిన్, హార్మోన్ల అసమతుల్యత వల్ల బ్లాక్ హెడ్స్ (blackheads) ఎక్కువ అవుతాయి. చర్మంపై ఎక్కువగా జిడ్డు ఉంటే ఈ సమస్య అధికంగా ఉంటుంది. బ్యూటీ పార్లర్లకు వెళ్లి ఎక్కువ ఖర్చు ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎక్కువ ధర కలిగిన క్రీమ్‌లను వాడుతూ ఉంటారు. అంతేకాకుండా బ్యూటీ పార్లర్ల (Beauty parlors)కు వెళ్లి ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే దొరికే పదార్థాలతో ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్‌ను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఎలాంటి దుష్ప్రభావాలు (Side effects) కూడా ఉండవు. ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సులభతరం. ఒక జార్‌లో పుదీనా ఆకులు వేసి మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి, వాటిలో పాము చెక్క నిమ్మరసం, టూత్ పేస్ట్‌తో పాటు పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. 5 నిమిషాలు ముఖానికి ఆవిరి మొదటగా బ్లాక్ హెడ్స్ (blackheads) ఉన్నచోట బాగా వేడి నీళ్ల (Very hot water)తో కడుక్కోవాలి. 5 నిమిషాలు ముఖానికి ఆవిరి (Facial steam) పట్టుకుని ఈ పేస్ట్ రాసి సున్నితంగా రద్దుకోవాలి. ఒక అరగంట ఉంచి ఆ తర్వాత దీనిని చల్లటి నీటితో కడుక్కోవాలి. కొంచెం గరుకుగా ఉండే బట్టను తీసుకొని బ్లాక్‌హెడ్స్ మీద రద్దాలి. ఇలా ఒక మూడురోజుల పాటు చేస్తే తొందరగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ తొలగిపోయి ముఖం (face) కాంతివంతం (bright )గా మారుతుంది. ఇది కూడా చదవండి: వాయుకాలుష్యం వల్ల కలిగే దుష్ప్రభావాలు #beauty-tips #remove-blackheads మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి