Ugadi: ఉగాదికి వీటిని దానం చేస్తే.. మీకు తిరుగేలేదు

ఉగాది రోజున చలివేంద్రం, విసనకర్ర, అన్నదానం, మామిడిని దానం చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. వీటిని దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. అలాగే ఇంట్లో సంపద, ఐశ్వర్యం అన్ని కూడా వస్తాయని అంటున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయని చెబుతున్నారు.

author-image
By Kusuma
New Update
Ugadi

Ugadi Photograph: (Ugadi)

హిందువులు తప్పకుండా ఉగాది పండుగను జరుపుకుంటారు. కొత్త దుస్తులతో ఎంతో భక్తితో ఉగాది పండుగను సరదాగా చేస్తుంటారు. అయితే ఈ ఏడాది ఉగాదిని మార్చి 30వ తేదీన జరుపుకుంటారు. ఉగాది పండుగ రోజు పూజ చేయడంతో పాటు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని పండితులు అంటున్నారు. అయితే ఉగాది పండుగ రోజు దానం చేయాల్సినవి ఏంటో చూద్దాం.

ఇది కూడా చూడండి: Liquor Shops : 1+1..వైన్ షాప్స్ బంపరాఫర్.. ఎగబడ్డ మందుబాబులు!

చలివేంద్రం

ఉగాది రోజున చలివేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఇంట్లో డబ్బు వృద్ధి చెందుతుందట. ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. ముఖ్యంగా రుణ బాధలు తీరి సంతోషంగా ఉంటారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం వల్ల డబ్బు, ఐశ్వర్యం, సంపద వృద్ధి చెందుతుంది. ఇంట్లో సంతోషంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PF Withdraw -Atm: ఇక ఏటీఎం నుంచి పీఎఫ్‌ నగదు తీసుకోవచ్చు...ఎప్పటి నుంచో తెలుసా?

విసనకర్ర
విసనకర్రను ఉగాది రోజున దానం చేయడం వల్ల దేవతల అనుగ్రహంతో పాటు పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుందని పండితులు అంటున్నారు. వీటితో పాటు సమస్యలు అన్ని కూడా తొలగిపోయి సుఖం వస్తుంది. అలాగే మోక్షం కూడా లభిస్తుందని పండితులు చెబుతున్నారు. 

మామిడి
మామిడితో ఉగాది రోజు పచ్చడి తయారు చేస్తారు. కొందరికి ఈ మామిడి లభించకపోవచ్చు. ఎవరైనా మీకు అడిగితే ఈ మామిడిని దానం చేయండి. దీనివల్ల మీకు పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: AP NEWS: షాకింగ్ న్యూస్.. ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్యశ్రీ బంద్.. ఎందుకంటే?

అన్నదానం
అన్ని దానాల కంటే అన్న దానం చాలా గొప్పదని అంటుంటారు. అయితే ఈ దానం చేయడం వల్ల అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని, ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయని పండితులు అంటున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Eye Tips: కంటిలో దుమ్ము పడితే రుద్దకుండా ఇలా చేయండి

కంటిలో నలక పడితే దానిని తొలగించడానికి కళ్లలో నీళ్లు చల్లుకోవచ్చు. నీటిని ఫోర్స్‌గా కడుక్కుంటే కంటిలోని దుమ్ము కణం లేదా చెత్త బయటకు వస్తాయి. దుమ్ము కణాలు పెద్దగా ఉంటే తెరిచి ఉన్న కళ్లలో నెమ్మదిగా నీటిని పోస్తే కంటి లోపలి నుండి చెత్తను తొలగించవచ్చు.

New Update

Eye Tips: కళ్లు చాలా సున్నితమైన అవయవం. ఒక చిన్న దుమ్ము ధూళి కళ్లలో పడితే అది గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. కళ్లలో మంట, విపరీతమైన నొప్పి, అసౌకర్యం కలుగుతుంది.  చాలా మంది కళ్లలో దుమ్ము పడినప్పుడు దానిని తొలగించడానికి శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకుంటారు. కొన్నిసార్లు ఏమి చేసినా దుమ్ము కణాలు పోవు. ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఆ చిట్కాలు ఏంటో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

చెత్తను తొలగించవచ్చు:

కంటిలో నలక పడితే దానిని తొలగించడానికి కళ్లలో నీళ్లు చల్లుకోవచ్చు. నీటిని ఫోర్స్‌గా కడుక్కుంటే కంటిలోని దుమ్ము కణం లేదా చెత్త బయటకు వస్తాయి. దుమ్ము కణాలు పెద్దగా ఉంటే తెరిచి ఉన్న కళ్లలో నెమ్మదిగా నీటిని పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల కంటి లోపలి నుండి చెత్తను తొలగించవచ్చు. కంటిలో నలకపడితే త్వరగా రెప్పవేయడం వల్ల చిన్న దుమ్ము కణాలు బయటకు వస్తాయి. పెద్ద దుమ్ము కణాలు ఉంటే రెప్ప వేసిన వెంటనే అవి కనురెప్పలోకి చొచ్చుకుపోతాయి.

ఇది కూడా చదవండి: తండ్రికి డయాబెటిస్ ఉంటే బిడ్డకు కూడా వస్తుందా?

ఇలా జరిగినప్పుడు కనురెప్పను తెరిచి సన్నని కాటన్ వస్త్రాన్ని ఉపయోగించాలి. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా చక్కెర కలిపి ఈ నీటితో కళ్లను శుభ్రం చేసుకుంటే నలక తొలగిపోతుంది. ఇంట్లో గేదె నెయ్యి ఉంటే దానిని వేడి చేసి వడకట్టి కళ్లలో రెండు చుక్కలు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కంటిలోని నలకలు తొలగిపోతాయి. అంతేకాకుండా కళ్లలో రెండు టేబుల్ స్పూన్ల ఆముదం నూనె వేయడం వల్ల నలక తొలగిపోవడమే కాకుండా కళ్లు కూడా శుభ్రం అవుతాయి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: వేసవిలో ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్‌తో లాభముందా?

( health-tips | latest health tips | best-health-tips | latest-news)

Advertisment
Advertisment
Advertisment