Ramadan : ఈ సంవత్సరం రంజాన్‌ ఎప్పుడు వస్తుంది?..రంజాన్‌ ప్రాముఖ్యత ఏంటి?

ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో రంజాన్ ఒకటి. రంజాన్ మాసం మొత్తం ముస్లింలందరూ ఉపవాసం ఉంటారు. అయితే ఈ పండగ సమయంలో ఉపవాసం చేయడం వెనుక ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అదేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
Ramadan : ఈ సంవత్సరం రంజాన్‌ ఎప్పుడు వస్తుంది?..రంజాన్‌ ప్రాముఖ్యత ఏంటి?

Ramadan : ముస్లింలు(Muslims) జరుపుకునే ముఖ్యమైన పండుగలలో రంజాన్(Ramadan) ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ రంజాన్ మాసం మొత్తం ఉపవాసం ఉంటారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆహారంతో పాటు కనీసం నీళ్లు కూడా లేకుండా ఉపవాసం ఉంటారు. ఈ రంజాన్‌ మాసం ఈద్-అల్-ఫితర్(Eid-Al-Fitr) వేడుకతో ముగుస్తుంది.

రంజాన్ మాసం సాధారణంగా 29 లేదా 30 రోజులు ఉంటుంది. రంజాన్ అనే పదం అరబిక్(Arabic) మూలం అర్-రామద్ నుండి వచ్చింది. దీని అర్థం మండే వేడి అని అంటున్నారు. అంతే కాదు రంజాన్ ఉపవాసాన్ని ఇస్లాం ఐదు స్థంభాలలో ఒకటిగా చెబుతారు. ఉపవాసం ప్రారంభించే ముందు తినే భోజనాన్ని సెహ్రీ లేదా సుహూర్ అని పిలుస్తారు. సాయంత్రం ప్రార్థన పిలుపు తర్వాత ఉపవాసం విరమించే భోజనాన్ని ఇఫ్తార్ అంటారు.

రంజాన్ ఉపవాస ప్రాముఖ్యత

రంజాన్ ఆధ్యాత్మికత, స్వీయ అభివృద్ధి, అల్లాహ్(Allah) పట్ల భక్తిని ప్రతిబింబించే పండగ. రంజాన్ సమయంలో ఉపవాసం అనేది స్వీయ క్రమశిక్షణ, ఆధ్యాత్మిక అవగాహనను బోధించే ముఖ్యమైన ఆరాధన . అంతే కాదు కుటుంబ, సమాజ సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఈ నెలలో భక్తి శ్రద్ధలతో రంజాన్ ను పాటించడం ద్వారా మీలోని విశ్వాసం పెంపొందుతుంది. అలాగే అల్లాహ్ కు మిమల్ని మరింత దగ్గర చేస్తుంది.

ఈ సంవత్సరం రంజాన్ ఎప్పుడు?

ఇస్లామిక్ క్యాలెండర్ చంద్రుని దశలను చెబుతుంది. దీనిని సాధారణంగా చంద్ర చక్రం అని పిలుస్తారు. పవిత్ర రంజాన్ నెల ప్రతి సంవత్సరం గ్రెగోరియన్ క్యాలెండర్ కంటే 10 రోజుల ముందు వస్తుంది. ఈ సంవత్సరం రంజాన్ సోమవారం మార్చి 11 లేదా మంగళవారం మార్చి 12న ప్రారంభం అవుతుందని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: మహిళలు రోజుకు ఎన్ని గంటలు నిద్రించాలి?.. పరిశోధకులు ఏమంటున్నారు?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBK VS RR: పంజాబ్ కింగ్స్ ను బోల్తా కొట్టించిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక పంజాబ్ బోల్తా పడింది. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

PBK VS RR

పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్ కెప్టెన్సీలో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ టార్గెట్ ను ఛేదించలేక కింగ్స్ బొక్క బోర్లా పడ్డారు. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాటర్ నేహాల్ వధేరా 62 పరుగులతో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇతని తర్వాత మాక్స్ వెల్ ఒక్కడే 30 పరుగులు చేసాడు. నేహాల్ , మ్యాక్స్ వెల్ చాలా సేపు క్రీజులో ఉండి జట్టు విజయానికి పాటు పడ్డారు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ కూడా కొట్టకపోవడంతో మ్యాచ్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది.  కింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచే వికెట్లను పోగొట్టుకుంటూ వచ్చింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అంతకు ముందు మ్యాచ్ లో బాగా ఆడిన ప్రభ్ మన్ సింగ్ ఎవరూ కూడా ఎక్కువసేపు ఉండలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3, సందీప్‌ శర్మ 2, మహీశ్ తీక్షణ 2, కార్తికేయ,  హసరంగ చెరో వికెట్‌ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్..

చంఢీఘడ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 67తో స్కోర్‌తో అదరగొట్టాడు. చివర్లో రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ కూడా 38 పరుగులతో రాణించాడు. నితీశ్ రాణా 12, హెట్ మయర్ 20, ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఫెర్గూసన్ 2, మార్కో జన్‌సెన్, అర్ష్‌దీప్‌ తలొ వికెట్ తీశాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | match | cricket

Also Read: RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

 

Advertisment
Advertisment
Advertisment