Long Distance Relationship : ఈ సంకేతాలు కనిపిస్తుంటే మీ లైఫ్‌ పార్టనర్‌ మీకు దూరం అవుతున్నట్టే లెక్క!

మీ భాగస్వామి మీతో సంభాషణపై ఆసక్తి చూపకపోతే అది మీ బంధానికి బ్రేక్‌ పడే సంకేతం కావొచ్చు. మీ లవర్‌ మీ వాయిస్ లేదా వీడియో కాల్‌ను విస్మరిస్తుంటే. మీ మధ్య ప్రేమ తగ్గిందని సంకేతం కావొచ్చు.

New Update
Long Distance Relationship : ఈ సంకేతాలు కనిపిస్తుంటే మీ లైఫ్‌ పార్టనర్‌ మీకు దూరం అవుతున్నట్టే లెక్క!

Relationship : మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే వారిని సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. అయితే కొన్ని కారణాల వల్ల ఒకరికొకరు దూరం గా ఉండాల్సిన జంటలు చాలానే ఉన్నాయి. ఏదో ఒక ఉద్యోగం, ఆ తర్వాత చదువు కారణంగా ఒకరికొకరు దూరంగా ఉంటారు.అలాంటి రిలేషన్ షిప్ ను లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ అంటారు. కానీ కొన్నిసార్లు కొన్ని చిన్న విషయాల వల్ల ఈ బంధం చెడిపోయి ఆ తర్వాత ఈ బంధం తెగిపోతుంది. అలాంటి పరిస్థితిలో మీరు ముందుగానే అలెర్ట్‌గా ఉంటే కాస్త బాధ తగ్గుతుంది. లేకపోతే ముందుగానే జాగ్రత్తపడి బంధాన్ని నిలబెట్టుకోవచ్చు. విడిపోయే సంకేతాలను గుర్తించడం, వాటిని నివారించడం చాలా ముఖ్యం. లేకపోతే మీ సంబంధం బ్రేక్(Breakup) కావచ్చు.

దంపతులు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఫోన్ లో మాట్లాడుకుంటారు, వీలైతే చాలా కాలం తర్వాత కలుస్తారు. కానీ మీ భాగస్వామి మీ వాయిస్ లేదా వీడియో కాల్ ను విస్మరిస్తుంటే, మీ మధ్య ప్రేమ తగ్గిందని సంకేతం కావచ్చు.

మీరు లాంగ్‌ టైమ్‌గా రిలేషన్‌లో ఉన్నప్పుడు.. ప్రతి రోజూ మీ లవర్‌(Lover) తో కాల్లో మాట్లాడటానికి మీరు ఉత్సాహంగా ఉంటారు. కానీ మీ భాగస్వామి(Life Partner) సంభాషణలో ఆసక్తి చూపకపోతే మీ సంబంధంలో ప్రేమ ముగిసిపోయే స్టేజీ వచ్చి ఉండొచ్చు.

ప్రేమ బంధంలో గొడవలు సర్వసాధారణమే. అయితే ప్రతి చిన్న విషయానికి విభేదాలు వచ్చేంతగా పెరిగిపోతే సమస్య రావచ్చు. అలాంటి పరిస్థితిలో మీ సంబంధం విచ్ఛిన్నం కావచ్చు.

నిజానికి ట్రూ లవర్స్‌ ఎప్పుడూ అబద్ధాలు చెప్పుకోరు. ఏ విధమైన సాకులు చెప్పరు. కానీ మీ భాగస్వామి ఇలా చేస్తుంటే సమస్య రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

Also Read: వేలు, లక్షలు అవసరం లేదు.. రూ.100తోనే మీ గర్ల్ ఫ్రెండ్‌కి బెస్ట్ గిఫ్ట్ ఇవొచ్చు!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు