Covid Vaccine : ఆ హీరోకి కోవిడ్‌ వ్యాక్సిన్‌ తో గుండెపోటు..షాకింగ్‌ విషయాలు వెల్లడి!

గతేడాది గుండెపోటుకు గురై దాని నుంచి కోలుకున్న బాలీవుడ్‌ నటుడు శ్రేయాస్‌ తల్పాడే..కొవిడ్‌ వ్యాక్సిన్‌ గురించి కొన్ని షాకింగ్‌ విషయాలను పంచుకున్నాడు. ఆ విషయాల గురించి ఈ కథనంలో..

New Update
Covid Vaccine :  ఆ హీరోకి కోవిడ్‌ వ్యాక్సిన్‌ తో గుండెపోటు..షాకింగ్‌ విషయాలు వెల్లడి!

Bollywood : బాలీవుడ్‌ తో పాటు మలయాళంలో కూడా మంచి పేరున్న నటుడు, నిర్మాత, డైరెక్టర్‌ అయిన శ్రేయాస్‌ తల్పాడే(Shreyas Talpade) కి గత సంవత్సరం గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే. ఆనాటి దురదృష్టకర సంఘటనలను తలచుకుంటూ శ్రేయాస్‌ కొన్ని విషయాలను పంచుకున్నారు. అందులో కొన్ని ఆసక్తికర విషయాలను శ్రేయాస్‌ వెల్లడించారు.

తాను ధూమపానం సేవించకపోయినా, మందు తాగకపోయినా తాను ఈ గుండెపోటు(Heart Attack) బారిన పడ్డానని బాధను వ్యక్తం చేశారు. తనకు కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉందని విషయం తెలుసు అని ఆయన వివరించారు. దాని కోసం మందులు వాడుతున్నట్లు వివరించారు. తనకు బీపీ, షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏమి లేవని పేర్కొన్నారు.

అయినా సరే తనకి గుండెపోటు ఎలా వచ్చిందనే ఆవేదన ఇప్పటికీ తన వేధిస్తుందని శ్రేయాస్‌ చెప్పుకోచ్చారు. బహుశా ఇది కోవిడ్‌ వ్యాక్సిన్‌(Covid Vaccine) వల్లే అయ్యిండొచ్చని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. నిజానికి కొవిడ్‌ మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రభుత్వం వ్యాక్సిన్‌ డ్రైవ్‌ లు చేపట్టింది. మనం కూడా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో వారు చెప్పిన డోస్‌ లు అన్నింటిని వేయించుకున్నాము.అయితే నిజానికి మనం శరీరంలోకి ఏం తీసుకుంటున్నాము...ఎలాంటి కంపెనీలను విశ్వసించాలో కూడా తెలియని స్థితి అది.

ప్రస్తుతం కోవిషీల్డ్‌(Covishield) తీసుకోవడం వల్ల ముగ్గురు చనిపోయారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే శ్రేయాస్‌ తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇది కోవిడ్ -19 లేదా వ్యాక్సిన్ అని తనకు కచ్చితంగా తెలియదని, ఎందుకంటే తన వద్ద ఎటువంటి ఆధారాలు లేవని, కాబట్టి ఎటువంటి ప్రకటన చేయడం పనికిరాదని ఆయన అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ అరుదైన దుష్ప్రభావాలను కలిగి ఉంటుందని మీకు తెలియజేద్దాం. ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసిన ఆస్ట్రాజెనెకా స్వయంగా UK హైకోర్టులో ఈ విషయాన్ని అంగీకరించింది.

గత సంవత్సరం డిసెంబర్ 14 న, శ్రేయాస్ తన చిత్రం 'వెల్‌కమ్ టు ది జంగిల్' షూటింగ్ తర్వాత అసౌకర్యానికి గురై గుండెపోటుకు గురయ్యాడు. అతను ముంబైలోని బెల్లేవ్ ఆసుపత్రిలో చేరాడు, అక్కడ అతని యాంజియోప్లాస్టీ జరిగింది.

Also read: మంత్రి పీఎస్‌ ఇంట్లో ఈడీ దాడులు.. 30 కోట్లు స్వాధీనం!

Advertisment
Advertisment
తాజా కథనాలు