Trump : భారీ ప్లాన్ తో వచ్చిన ట్రంప్ నిందితుడు... కారులో భారీగా పేలుడు పదార్థాలు! అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నానికి యత్నించిన నిందితుడు భారీ స్కెచ్ తో వచ్చినట్లు సమాచారం.నిందితుడి కారులో భారీగా పేలుడు పదార్థాలు ఉన్నాయని అమెరికన్ మీడియా నివేదించింది. By Bhavana 15 Jul 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Shooter Fired On Trump : అమెరికా (America) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై హత్యాయత్నానికి యత్నించిన నిందితుడు భారీ స్కెచ్ తో వచ్చినట్లు సమాచారం. శనివారం పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో 20 ఏళ్ల నిందితుడు థామస్ మాథ్యూ క్రూక్స్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో బుల్లెట్ తలకు మిసై, ట్రంప్ చెవిని తాకుతూ వెళ్లింది. వెంటనే తేరుకున్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు (Secret Service Agents) ట్రంప్‌ని రక్షించి, నిందితుడిని హతమార్చారు. అయితే, కాల్పులు జరిపిన నిందితుడి కారులో భారీగా పేలుడు పదార్థాలు ఉన్నాయని అమెరికన్ మీడియా నివేదించింది. వాల్‌స్ట్రీట్ జర్నల్, సీఎన్ఎస్ షూటర్ కారులో పేలుడు పదార్థాలను కనుగొన్నట్లు నివేదించాయి. అయితే, ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై అధికార డెమొక్రటిక్ పార్టీ, అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పై రిపబ్లికన్ నాయకులు దుమ్మెత్తి పోస్తున్నారు. మరోవైపు ప్రపంచ దేశాధినేతలు ట్రంప్ త్వరగా కోలుకోవాలని అన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్దాన్ని ప్రస్తావిస్తూ ట్రంప్ దాడిపై బైడెన్ పరిపాలనను నిందించింది. Also read: మెగా స్కామ్ 2024.. ఏకంగా రూ.2,500 కోట్లు! #america #donald-trump #shooter మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి