Shocking Incident: ఒకే ఇంట్లో 11 మృతదేహాలు,హత్యా లేక ఆత్మహత్యా? మృతుల్లో చిన్నారులు..!! పాకిస్థాన్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఒకే ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతదేహాలు లభ్యం కావడం సంచలనం రేపింది. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఓ ఇంట్లో 11 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతుల్లో చిన్నారులు ఉన్నారు. By Bhoomi 10 Jan 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Shocking Incident: షాకింగ్ ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానస్పదస్థితి(11 suspicious deaths)లో మరణించిన ఘటన ఇది. వారి మృతదేహాలు రెండు రోజులుగా ఇంట్లోనే పడి ఉన్నాయి. రెండు రోజుల నుంచి ఇంటి గేటు తెరవకపోయే సరికి అనుమానం వచ్చిన చుట్టుపక్కలవారు ఇంటి తలుపులు పగులగొట్టారు. ఇంట్లో పడి ఉన్న మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. అన్నదమ్ములకు చెందిన రెండు కుటుంబాల సభ్యులు మరణించారు. దీంతో పోలీసులు ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు. ఈ ఘటన పాకిస్తాన్ (Pakistan)లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్(Khyber Pakhtunkhwa Province)లోని లక్కీ మార్వాత్‌దిలో జరిగింది. ముగ్గురు అన్నదమ్ములు ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. వారికి ఇంటి విషయంలో తగాదాలు జరుగుతున్నాయి. అయితే రెండు రోజుల క్రితం ఆ కుటుంబానికి చెందిన వజీరిస్థాన్ రెండు రోజుల క్రితం ఆహారాన్ని తీసుకువచ్చినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. ఇంట్లో గొడవల వల్లే ఆహారంలో విషం పెట్టినట్లు అంగీకరించాడు. మరణించిన కుటుంబ సభ్యులలో ఇద్దరు సోదరులు, వారి పిల్లలు ఉన్నారు. రెండు రోజుల క్రితం విషం కలిపిన ఆహారం తినడం వల్లే వీరంతా మరణించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇది కూడా చదవండి: ఇది మ్యాచ్ ఫిక్సింగ్…స్పీకర్ తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తాం..!! ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.మరణించిన కుటుంబానికి చెందిన బంధువు వజీరిస్థాన్ నుండి రెండు రోజుల క్రితం ఆహారాన్ని కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. ఒకే కుటుంబంలో 11 మంది అనుమానస్పద స్థితిలో నిర్జీవంగా కనిపించడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ కుటుంబంలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలలేదు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకోవడంతో అక్కడి ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. #crime #pakistan-news #shocking-incident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి