శివరాజ్‌సింగ్‌కు కీలక పదవి!.. న‌డ్డాతో భేటీ అయిన మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం

మ‌ధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌కు బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించబోతోందని సమాచారం. ఈ లోకసభ ఎన్నికల అనంతరం ఆయనను కేంద్ర కేబినెట్ లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. విధిశ నుంచి ఆయన పార్లమెంటుకు పోటీ చేస్తారని తెలుస్తోంది.

New Update
శివరాజ్‌సింగ్‌కు కీలక పదవి!.. న‌డ్డాతో భేటీ అయిన మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం

Shivraj Singh Chauhan: మ‌ధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌కు బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించబోతోందా? తాజా పరిణామాలను చూస్తే అవుననే అనిపిస్తోంది. సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వచ్చిన ఆయన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ న‌డ్డాతో ఆయన నివాసంలో మంగ‌ళ‌వారం శివరాజ్‌ సింగ్‌ భేటీ అయ్యారు. పార్లమెంట్‌ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న సమయంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనకు కీలక పదవి కట్టబెట్టే ఆలోచనలో అధిష్టానం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

ఇది కూడా చదవండి: ఢీ కొడతారా!.. డీలా పడతారా!.. మోదీ, షా ద్వయాన్ని ఖర్గే నిలువరిస్తారా!

పార్లమెంటు ఎన్నికలు అతి సమీపంలో ఉన్నందున కేంద్రమంత్రి పదవికి అవకాశం తక్కువ. అయితే, ఈసారి ఆయనను లోకసభకు పోటీ చేయించి అనంతరం కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. విదిశ లోకసభ స్థానం నుంచి ఆయన పార్లమెంటు ఎన్నికల బరిలో నిలవబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: తల్లే సూత్రధారి.. నిజామాబాద్ ఫ్యామిలీ మర్డర్లపై సంచలన విషయాలు వెల్లడించిన ఎస్పీ

సమావేశం అనంతరం నడ్డా మాట్లాడుతూ పార్టీ కార్యకర్తగా అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తానన్నారు. తనకు ఏ బాధ్యత అప్పగించిన నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర శాస‌నస‌భాప‌క్ష స‌మావేశంలో పాల్గొనేందుకు తిరిగి భోపాల్‌ చేరుకున్నారు.

మరోవైపు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ప‌నిచేసి, బలమైన ఓబీసీ నాయకుడిగా ఎదిగిన శివ‌రాజ్ సిగ్‌ చౌహాన్‌కు పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవిని అధిష్టానం కట్టబెట్టవచ్చని కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు