Ramadan : రంజాన్‌లో మూడు రోజుల దుఃఖాన్ని వీరే జరుపుకుంటారు.!

రంజాన్‌ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. అయితే ముస్లింల్లోని ఓ వర్గం మాత్రం రంజాన్‌లో మూడు రోజుల పాటు సంతోషకరమైన ఈవెంట్లను జరుపుకోదని తెలుస్తుంది. అయితే ఆ వర్గం ఏమిటి? ఎందుకు రంజాన్‌లో మూడు రోజుల దుఃఖాన్ని జరుపుకుంటారో పూర్తిగా తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
Ramadan : రంజాన్‌లో మూడు రోజుల దుఃఖాన్ని వీరే జరుపుకుంటారు.!

Ramadan Festival : రంజాన్‌(Ramadan) మాసం ముస్లిం(Muslims) లకు ఎంతో పవిత్రమైనది. రంజాన్ ఇస్లామిక్ చంద్రమాన క్యాలెండర్ లో తొమ్మిదవ నెలలో మొదలవుతుంది. రంజాన్ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ఈ ఏడాది మన దేశంలో రంజాన్ మార్చి 12న మొదలైంది. ముస్లింల పవిత్ర గ్రంధమైన ఖురాన్ అవతరించింది రంజాన్ నెలలోనే. సమస్త మానవాళికి మార్గనిర్దేశంగా ఖురాన్ గ్రంధాన్ని అందించినందుకు కృతజ్ఞతతో ముస్లింలు నెలరోజులు విధిగా ఉపవాసాలు(Fasting) ఆచరిస్తారు. అయితే ముస్లింల్లోని ఓ వర్గం మాత్రం రంజాన్‌లో మూడు రోజుల పాటు సంతోషకరమైన ఈవెంట్లను జరుపుకోదు. ప్రపంచంలోని కోట్లాది ముస్లింలు రంజాన్‌లో ఈ మూడు రోజులు దుఃఖిస్తారు. ఎందుకు ఇలా చేస్తారో .. ముస్లిం వర్గాలు విభజన గురించి ఇవాళ తెలుసుకుందాం!

విభజనకు కారణమేంటి?
ప్రపంచ జనాభాలో 25శాతం కంటే ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు. 2020 గణాంకాల ప్రకారం వీరి సంఖ్య 190 కోట్ల కంటే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలను షియా, సున్నీ అనే రెండు వర్గాలుగా విభజించారు. ముస్లింల మొత్తం జనాభాలో దాదాపు 87-90శాతం మంది అంటే 170 కోట్లమంది సున్నీలు ఉంటారు. మిగిలిన 10–13శాతం మంది షియాలు ఉంటారు. ఇస్లామిక్ నాయకుడిగా మహమ్మద్ ప్రవక్త వారసుడు ఎవరు అనే ప్రశ్నతో ముస్లింలను రెండు వర్గాలుగా విడిపోయింది. మహమ్మద్ ప్రవక్త కుటుంబంలో ఆయన కుమార్తె ఫాతిమా, అల్లుడు అలీ, వారి ఇద్దరు కుమారులు హసన్, హుస్సేన్ ఉన్నారు. మహమ్మద్ ప్రవక్త తన అల్లుడు అలీని తన వారసుడిగా, ఇస్లామిక్ నాయకుడిగా ఎంచుకున్నారు. మహమ్మద్ ప్రవక్త తర్వాత అలీని తమ మొదటి ఇస్లామిక్ నాయకుడిగా భావించిన ముస్లింలను షియా అని పిలుస్తారు. షియాలు ఈ ఇస్లామిక్ నాయకుడిని తమ మొదటి ఇమామ్‌గా భావించారు. ముహమ్మద్ ప్రవక్త తర్వాత తమ మొదటి ఇస్లామిక్ నాయకుడిగా అలీని అంగీకరించని వారిని సున్నీ అని పిలుస్తారు. సున్నీలు తమ మొదటి ఇస్లామిక్ నాయకుడిని ఖలీఫా అని పిలిచేవారు.

Also Read: వావ్..! నవ్వుతో పడేస్తున్న టిల్లు బ్యూటీ.. చీరలో అందాల హొయలు

సున్నీ సంఘం దాని మొదటి ఖలీఫా అబూ బకర్, రెండో ఖలీఫాగా ఉస్మాన్, మూడో ఖలీఫాగా ఒమర్, నాలుగో ఖలీఫాగా అలీని పరిగణించారు. ఆ తర్వాత సున్నీ, షియా వర్గాల మధ్య దూరాలు ఏర్పడ్డాయి. అబూ బకర్, ఉస్మాన్, ఉమర్ మహమ్మద్ ప్రవక్త అనుచరులు కూడా.

షియాల ఇమామ్‌లు ఎవరు?

షియాలు అలీని మొదటి ఇమామ్‌గా భావించారు. రెండో ఇమామ్‌గా అలీ పెద్ద కొడుకు హసన్‌.. మూడో ఇమామ్‌గా అలీ చిన్న కొడుకు హుస్సేన్‌ను పరిగణించారు. నాల్గవ ఇమామ్‌గా హుస్సేన్ కుమారుడు జైనుల్-అబెదిన్‌ను పరిగణించారు. ఐదో ఇమామ్ జైనుల్-అబెదిన్ కుమారుడు ముహమ్మద్ బాకీర్, ఆరవ ఇమామ్ జాఫర్ సాదిక్, ఏడో ఇమామ్ మూసా కాజిమ్, ఎనిమిదో ఇమామ్ అలీ రిజా, తొమ్మిదో ఇమామ్ మహమ్మద్ తాకీ, 10వ ఇమామ్ అలీ నఖీ, 11వ ఇమామ్ హసన్ అస్కారీ.. 12వ ఇమామ్ మహమ్మద్ మెహందీని షియాలను తమ ఇమామ్‌గా భావిస్తారు.

మహర్రం ఎందుకంటే?
ఇరాక్‌(Iraq) లోని కర్బలా నగరంలో 72 మందితో పాటు హత్యకు గురయ్యారు మూడో ఇమామ్ హుస్సేన్. వారి త్యాగాన్ని స్మరించుకుంటూ షియా సమాజం మహర్రం మాసంలో సంతాపం పాటిస్తుంది. షియాలు ప్రవక్త సొంత కుటుంబంలోని తరాలను తమ ఇమామ్‌లుగా భావించారు. వారి ఇస్లామిక్ విలువలు ఖలీఫాల భిన్నంగా ఉంటాయి. సున్నీ కమ్యూనిటీ ప్రజలు కూడా ప్రవక్త కుటుంబ సభ్యులు, కుమార్తె ఫాతిమా, అల్లుడు అలీ , మనవళ్లు హసన్, హుస్సేన్‌లను గౌరవిస్తారు. అయితే హుస్సేన్ మరణానికి మాత్రం సంతాపం వ్యక్తం చేయరు.

దుఃఖాన్ని ఎవరు జరుపుకుంటారు?

మహర్రం కాకుండా షియా కమ్యూనిటీ ప్రజలు రంజాన్‌లో మూడు రోజుల సంతాపాన్ని పాటిస్తారు. రంజాన్ 19, 20, 21 రోజుల్లో ఇలా చేస్తారు. రంజాన్ 19వ రోజు మసీదులో ఉదయం ప్రార్థనలు చేస్తున్నప్పుడు మహమ్మద్ ప్రవక్త అల్లుడు, షియాల మొదటి ఇమామ్ హజ్రత్ అలీని కొందరు కత్తితో దాడి చేశారు. అందుకే ఆ రోజు వీరికి సంతాప దీనం. ఆ తర్వాత రెండు రోజులు ప్రాణాలతో పోరాడిన అలీ 21వ రోజు ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. అందుకే ఈ మూడు రోజులలో, షియా కమ్యూనిటీ ప్రజలు జిక్ర్-ఎ-అలీ చేయడం ద్వారా ఆయన్ను స్మరించుకుంటారు. ఈ తేదీల్లో సంతోషకరమైన ఈవెంట్‌లకు దూరంగా ఉంటారు. ఇలా మొత్తం ముస్లిం జనాభా ప్రధాన వర్గామైన షియాలు ఈ రంజాన్‌ మాసంలో మూడు రోజుల పాటు దుఃఖాన్ని పాటిస్తారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు