Shankupushpam Tea : అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం శంఖుపువ్వు టీ శంఖు పువ్వులో చాలా ఔషధ గుణాలున్నాయని నిపుణులు అంటున్నారు. బరువు తగ్గేందుకు డైట్‌లో ఉండే వారికి ఇది అద్భుతమైన డ్రింక్. రోజూ ఒక కప్పు వెచ్చని బ్లూ టీ తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటికి పోతాయి. కడుపు, కాలేయం, కిడ్నీలను శుభ్రపరుస్తుంది. By Vijaya Nimma 13 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Shankupushpam Tea Benefits : శంఖు పువ్వు ఇతర పువ్వుల్లా సువాసనగా ఉండకపోయినా ఇందులో చాలా ఔషధ గుణాలున్నాయి. ఈ శంఖు పువ్వు(Shankupushpam) తల నుంచి కాలి వరకు మనకున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుంది. పాశ్చాత్య దేశాల్లో దీని గొప్పతనం తెలుసుకుని బ్లూ టీగా తాగుతున్నారు. ఇది మన పట్టణాలలో చాలా తేలికగా దొరుకుతుంది. కానీ మనం దానిని ఉపయోగించం. ఈ శంఖు పువ్వు టీలో ఉండే ఔషధ ప్రయోజనాల గురించి మీకు తెలిస్తే రోజూ దీన్ని తాగుతారు. అసలు బ్లూ టీ స్పెషాలిటీ ఏంటి? ఇందులో సాధారణ టీ, కాఫీల్లో ఉన్నట్టు కెఫిన్ ఉండదు. అనేక యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఇది శరీరానికి చాలా ఆరోగ్యకరమైనది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది: బ్లూ టీ(Blue Tea) లో సున్నా శాతం కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఉంటాయి. కాబట్టి బరువు తగ్గేందుకు(Weight Loss) డైట్‌లో ఉండే వారికి ఇది అద్భుతమైన డ్రింక్. ఇది ఆహారంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. పేగులను శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా ఎక్కువ తినకుండా చూస్తుంది. దీంతో బరువు సులభంగా తగ్గుతారని నిపుణులు అంటున్నారు. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: బ్లూ టీలోని ఫ్లేవనాయిడ్లు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి, చర్మాన్ని సంరక్షిస్తాయి. రోజూ ఒక కప్పు వెచ్చని బ్లూ టీ తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటికి పోతాయి. కడుపు, కాలేయం, కిడ్నీలను ఇది శుభ్రపరుస్తుంది. Also Read : Valentine Week – Kiss Day : ఒక ముద్దు అనేక వ్యాధుల నుంచి కాపాడుతుందని మీకు తెలుసా! జుట్టు పెరుగుదలలో సహాయపడుతుంది: దీనిలోని కోన్ ఫ్లవర్ జుట్టుకు బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ తలకు రక్త ప్రసరణను పెంచి శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు కుదుళ్లను లోపలి నుంచి బలపరుస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మధుమేహం నియంత్రణకు: రోజూ ఒక కప్పు బ్లూ టీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్(Diabetes) ఉన్నవారు రక్తం చక్కర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. అంతేకాకుండా జీర్ణక్రియను కూడా సులభతరం చేస్తుంది. దీనిలోని ఫినోలిక్ యాసిడ్, ఫినోలిక్ అమైడ్‌లు ఇన్సులిన్ స్థాయిలు మెరుగుపరుస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: బ్లూ టీలో శక్తివంతమైన బయో ఫ్లేవనాయిడ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలు, గుండెకు హాని కలిగించే ట్రైగ్లిజరైడ్స్, చెడు కొవ్వులను కూడా తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: కొందరి చేతికి ఆరు వేళ్లు ఎందుకు ఉంటాయి?..కారణం ఇదేనా? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #blue-tea #shankupushpam-tea మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి