Aryan Khan: ఓటీటీలో షారుక్ ఖాన్ కొడుకు వెబ్ సిరీస్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఏడాది కాలంగా ఒక వెబసిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే తాజా గా ఈ వెబ్ సిరీస్ పై ఓక ఇంట్రస్టీంగ్ విషయం బయటకు వచ్చింది.అదేంటంటో ఇప్పుడు చూద్దాం..

New Update
Aryan Khan: ఓటీటీలో షారుక్ ఖాన్ కొడుకు వెబ్ సిరీస్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Aryan Khan Web Series Stardom: సిని ప్రపంచంలో చాలా మంది స్టార్ హీరోలు కొడుకులు కూడా వారిలాగే పెద్ద హీరోలగా రాణించాలని ఆశిస్తారు. కానీ ఇప్పటి తరంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం కోలీవుడ్ దళపతి విజయ్ తనయుడు డైరెక్టర్ గా మారడానికి సన్నాహాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో  షారుఖ్ (Shah Rukh Khan) వారసుడు ఆర్యన్ ఖాన్ కూడా  నడుస్తున్నాడు. దర్శకుడిగా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడానికి ఆర్యన్ ముందుగా వెబ్ సిరీస్ ను ఎంచుకున్నాడు.

అందులో భాగంగానే ఆర్యన్ ఖాన్ 'స్టార్‌డమ్‌' అనే సిరీస్‌కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సిరీస్ గురించి తాజాగా కొత్త అప్‌డేట్ వచ్చింది. ఈ సిరీస్ చివరి దశ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ ఏడాది చివర్లో స్టార్‌డమ్‌ సిరీస్ విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.కొంతకాలం క్రితం ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఈ కేసుపై సర్వత్రా చర్చ జరిగింది. ఈ ఘటన నుంచి ఆర్యన్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సినిమా డైరెక్షన్ వైపు మళ్లాడు. 'స్టార్‌డమ్' సినిమా షూటింగ్ 2023 జూన్‌లో ప్రారంభమైంది.

ఇటీవల ఆర్యన్ ఖాన్ గురుగ్రామ్‌లోని రాయల్ పామ్స్ హోటల్ లో స్టార్ డమ్ షూటింగ్ కోసం జరిపారు. ఐదు రోజుల పాటు ఇక్కడే చిత్రీకరించారు. దీంతోపాటు అంధేరీ ఈస్ట్‌, మరికొన్ని దీవుల్లో షూటింగ్‌ జరిగింది. మే నెలాఖరు నాటికి షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది.స్టార్ డమ్ సిరీస్ లో ఆరు ఎపిసోడ్‌లు ఉంటాయి. అయితే ఇందులో ఎవరెవరు నటిస్తున్నారు. షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, రణవీర్ సింగ్, బాబీ డియోల్ అతిధి పాత్రల్లో నటించనున్నారు. 'రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌' పతాకంపై షారూఖ్‌ భార్య గౌరీ ఖాన్‌ ఈ సిరీస్ ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bramhamudi serial appu లవర్ ని పరిచయం చేసిన 'బ్రహ్మముడి' అప్పు.. అతడెవరో తెలిస్తే షాక్!

బ్రహ్మముడి ఫేమ్ అప్పు అలియాస్ నైనిష రాయ్ తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది. అతడితో కలిసి కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ నా జీవితం, నా బలం, నా సర్వస్వం అంటూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ అప్పు

బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ అప్పు

Bramhamudi serial appu బుల్లితెర నటి నైనిష తెలుగులో అనేక సీరియల్స్ లో నటించినప్పటికీ 'బ్రహ్మముడి' సీరియల్ తో బాగా పాపులర్ అయ్యింది. ఈ సీరియల్ అప్పు పాత్రలో టామ్ బాయ్ గా కనిపిస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. బెంగాలీ నుంచి వచ్చినా.. ఎంచక్క తెలుగులో మాట్లాడుతూ సందడి చేస్తుంది నైనిష. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది. 

లవర్ ని పరిచయం చేసిన నైనిష 

లవర్ తో దిగిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫొటోలను చేస్తూ ఓ క్యాప్షన్ కూడా పెట్టింది. నా జీవితం, నా సర్వస్వం, నా బలం, నా ఆనందం అని రాసుకొచ్చింది. బాయ్ ఫ్రెండ్ గుండెలపై పడుకొని క్యూట్ గా ఫోజులిచ్చింది. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. క్యూట్ కపుల్, సూపర్ జోడీ, నైస్ అంటూ రిప్లై లు ఇస్తున్నారు. అలాగే అతడు ఎవరు? ఏం చేస్తుంటారు? ఎక్కడ ఉంటారు అని అడుగుతున్నారు. కానీ నైనిష మాత్రం వీటికి ఎక్కడ రిప్లై ఇవ్వలేదు. 

ఇక నైనీష కెరీర్ విషయానికి వస్తే.. తెలుగులో భాగ్య రేఖ, హాసంగీతం, శ్రీమంతుడు, ఇంటిగుట్టు, వంటి సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం మాటీవీలో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ నటిస్తోంది. ఈ సీరియల్ అప్పు పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంది. మొదటగా టామ్ బాయ్ గెటప్ లో రౌడీలా కనిపించిన అప్పు.. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అయ్యి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. చిన్నప్పటి నుంచి సినిమా ఫీల్డ్ పై ఇంట్రెస్ట్ ఉన్న నైనిష బెంగాలీ సినిమాల్లో చైల్ ఆర్టిస్టుగా కూడా నటించింది. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కెరీర్ ప్రారంభంలో తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్లు పలు ఇంటర్వ్యూలో చెప్పింది నైనిష. 

latest-news | cinema-news | bramhamudi-serial 

 

Advertisment
Advertisment
Advertisment