Crime: రూ. 600 కోసం కన్నకూతురి గొంతు కోసిన తండ్రి!

కేవలం రూ. 600 కోసం కన్న కూతురినే గొంతు కోసి చంపేశాడో కసాయి తండ్రి. ఈ ఘటనలో తల్లి కేవలం ప్రేక్షక పాత్ర వహించింది తప్ప..జరుగుతున్న దారుణ ఘటనను అడ్డుకోలేకపోయింది. ఈ దారుణ సంఘటన షాజహాన్‌పూర్‌ లోని భరద్వాజీ ప్రాంతంలో జరిగింది.

New Update
Crime: రూ. 600 కోసం కన్నకూతురి గొంతు కోసిన తండ్రి!

Crime: పితృదినోత్సవాన్ని అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటుంటే... కేవలం రూ. 600 కోసం కన్న కూతురినే గొంతు కోసి చంపేశాడో కసాయి తండ్రి. ఈ ఘటనలో తల్లి కేవలం ప్రేక్షక పాత్ర వహించింది తప్ప..జరుగుతున్న దారుణ ఘటనను అడ్డుకోలేకపోయింది. ఈ దారుణ సంఘటన షాజహాన్‌పూర్‌ లోని భరద్వాజీ ప్రాంతంలో జరిగింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అతడు సహజంగానే నేరస్తుడని తెలిసింది. అతని మీద ఇప్పటికే 16 కేసులు నమోదు అయ్యాయి. ఆ ప్రాంతానికి చెందిన సంజయ్‌ గుప్తా, తన భార్య వందన, కుమారుడు పూర్తిలతో కలిసి నివాసం ఉంటున్నాడు. సంజయ్‌ కుమార్తె పూర్తి రెండు సంవత్సరాల క్రితం ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని గొడవలు రావడంతో పుట్టింట్లోనే బిడ్డతో నివాసం ఉంటుంది.

సంజయ్ కొడుకు పవన్ కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జూన్ 13న కూతురితో పాటు తాను కూడా బంగారు ఉంగరాన్ని అమ్మేందుకు బయటకు వెళ్లినట్లు తల్లి వందన పోలీసులకు వివరించింది.

ఆ ఉంగరం అమ్మగా వచ్చిన డబ్బుతో ఇంటి సామాగ్రి కొనుక్కుని మిగిలిన డబ్బుతో ఇంటికి తిరిగి రాగా.. మిగిలిన రూ.600 కూతురిని తండ్రి సంజయ్ అడిగాడు. కానీ వాటిని ఇచ్చేందుకు పూర్తి నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన సంజయ్‌ రాత్రి అందరూ నిద్ర పోయిన తరువాత రాత్రి 12.15 గంటల ప్రాంతంలో పూర్తి మెడపై కత్తితో కోసి హత్య చేశాడు.

నిందితున్ని పోలీసులు అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేశారు. నిందితుడి మీద ఇప్పటికే అక్రమ మద్యం, పిస్టల్‌ని లైసెన్స్‌ లేకుండా కలిగి ఉన్నాడనే ఆరోపణల కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Also read: రూ. 2 లక్షల రుణమాఫీ పై అలర్ట్‌.. వారికి మాత్రమే !

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Crime: ఓరి పాపిస్టోడా.. రూ.5 కోసం ముసలవ్వను కొట్టి కొట్టి చంపేశావ్ కదరా!

అన్నమయ్య జిల్లాలో శనివారం దారుణం జరిగింది. రూ.5 కోసం జరిగిన వివాదం వృద్ధురాలిని బలిగొంది. ఆటో ఎక్కిన గంగులమ్మ (70) తనకు రావాల్సిన రూ.5 తిరిగి అడిగింది. డ్రైవర్ ఇవ్వకపోవడంతో తిట్టింది. కోపగ్రస్తుడైన డ్రైవర్ ఆమెను కొట్టి కొట్టి చంపేశాడు.

New Update
Annamayya Madanapalle woman died after being attacked by an auto driver

Annamayya Madanapalle woman died after being attacked by an auto driver

ఏపీలో దారుణమైన ఘటన జరిగింది. 70 ఏళ్ల ముసలవ్వకు, ఆటో డ్రైవర్‌కు మధ్య రూ.5 కోసం జరిగిన వాగ్వాదం ఒకరి చావుకి కారణమైంది. ఆటో డ్రైవర్ రూ.5 ఎక్కువ తీసుకున్నాడని.. ముసలవ్వ నోరు పారేసుకుంది. అది సహించుకోలేని ఆటో డ్రైవర్.. ఏకంగా ఆమెను కానరాని లోకాలకు పంపించేశాడు. ఆ వృద్ధురాలిని కొట్టి కొట్టి చంపేసి రోడ్డుపై పడేశాడు. రన్నింగ్ ఆటోలోంచి కింద పడిపోయినట్లు కథ అల్లాడు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. 

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

రూ.5 గొడవకు ప్రాణం బలి

రూరల్ ఎస్సై గాయత్రి ప్రకారం.. రెడ్డెప్ప, గంగులమ్మ (70) దంపతులు. వీరు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మండలం, చంద్రాకాలనీలో ఉంటున్నారు. గాజులు, బొమ్మలను జాతరలో అమ్ముతూ జీవిస్తున్నారు. రెండు రోజుల క్రితం (శుక్రవారం) రాత్రి గంగులమ్మ అక్క లక్ష్మీ దేవి కుమారుడు వెంకటరమణ నీటితొట్టెలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని చికిత్స నిమిత్తం తిరుపతికి తీసుకెళ్లారు. 

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

దీంతో ట్రీట్మెంట్ కోసం డబ్బులు అవసరమని గంగులమ్మ రూ.2 లక్షలు తీసుకుని బయల్దేరింది. ఇందులో భాగంగానే విష్ణు అనే వ్యక్తి షేర్ ఆటో ఎక్కింది. సీఎస్‌ఐ చర్చి వద్ద ఆమె దిగి ఆటో డ్రైవర్‌కు రూ.20 ఇచ్చింది. తిరిగి తనకు రూ.5 వస్తాయని అడిగింది. ఆ ఆటో డ్రైవర్ ఇవ్వకపోవడంతో ముసలవ్వ అతడ్ని తిడుతూ మళ్లీ ఆటో ఎక్కింది. అయితే తనను తిట్టడం అవమానంగా భావించిన ఆ ఆటోడ్రైవర్ బసినికొండ పంచాయతీలోని రామాచార్లపల్లె సమీపంలోకి తీసుకెళ్లి కొట్టి కొట్టి చంపేశాడు. 

Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

ఆపై రోడ్డుపై పడేసి.. రన్నింగ్ ఆటోలోంచి దూకి చనిపోయినట్లు కథ అల్లాడు. ఇక ఈ విషయం తెలుసుకుని పోలీసులు రంగంలోకి దిగారు. తమదైన శైలిలో ఆటో డ్రైవర్ విష్ణు విచారించడంతో అసలు నిజం బయటపడింది. అయితే ప్రస్తుతం గంగులమ్మ తీసుకెళ్లిన రూ.2 లక్షలు ఏమయ్యాయి అనే విషయంపై విచారిస్తు్న్నామని ఎస్ ఐ గాయత్రి తెలిపారు. 

(crime news | murder | latest-telugu-news | telugu-news | AP Crime | ap-crime-news)

Advertisment
Advertisment
Advertisment