RRB: ప్రశ్న పత్రం లీకేజీ.. మాజీ ఛైర్మన్‌కు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు సంబంధించి ప్రశ్న పత్రం లీకేజీ కేసులో హైదరాబాద్‌ సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మాజీ ఛైర్మన్‌ సతేంద్రమోహన్‌తో సహా 8 మందికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.7.87 లక్షల జరిమానా విధించింది.

New Update
RRB: ప్రశ్న పత్రం లీకేజీ.. మాజీ ఛైర్మన్‌కు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

Railway Recruitment: రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు (RRB) సంబంధించి ప్రశ్న పత్రం లీకేజీ కేసులో హైదరాబాద్‌ సీబీఐ (CBI Court)  కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 2010లో సహాయ స్టేషన్‌ మాస్టర్‌, సహాయ లోకోపైలట్‌ పోస్టుల కోసం రైల్వే బోర్డు నిర్వహించిన పరీక్ష ప్రశ్నపత్రాలు లీకైన విషయం తెలిసిందే. కాగా నిందితులు మధ్యవర్తుల ద్వారా అభ్యర్థుల నుంచి రూ.3.5 లక్షల నుంచి రూ.4.5 లక్షల దాకా వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

అన్యాయం జరిగింది..
అయితే ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకున్న అధికారులు.. కష్టపడి చదివిన అభ్యర్థులకు అన్యాయం జరిగినట్లు ఆరోపణలు రావడంతో రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు అప్పటి ఛైర్మన్‌తోపాటు ప్రైవేటు వ్యక్తులపై 2010 జూన్‌ 15న సీబీఐ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బుధవారం తుది విచారణ చేపట్టిన హైదరాబాద్ సీబీఐ కోర్టు ముంబై మాజీ ఛైర్మన్‌ సతేంద్రమోహన్‌, హసన్‌-మంగళూరు రైల్వే అభివృద్ధి మండలి మాజీ సీఈవో ఎ.కె.జగన్నాథం సహా మరో 8 మందికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.7.87 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.

ఇది కూడా చదవండి : TSPSC: రేవంత్ ఇది కరెక్టు కాదు.. సీబీఐని ఆశ్రయిస్తానంటున్న ఆర్ఎస్ పీ

15 మంది నిందితులు..
ఈ మేరకు కేసు దర్యాప్తు సమయంలో 15 మందిని అరెస్టు చేయగా పలువురు బెయిలు పొందారు. 2010 సెప్టెంబరు 13న 15 మందిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసింది. ఇరుపక్షాల వాదనలను విన్న సీబీఐ కోర్టు పది మంది నిందితులకు 5 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. నలుగురిని నిర్దోషులుగా విడుదల చేయగా, ఒకరు కేసు విచారణలో ఉండగానే మృతిచెందారు. శిక్ష పడినవారిలో అప్పటి రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌, సీఈవోలతోపాటు మధ్యవర్తులుగా ఉన్న జగన్నాథం షరీన్‌ కుమార్‌, పి.అశోక్‌కుమార్‌; జగన్నాథం రమేష్‌, జగన్నాథం తిరుపతయ్య, ఎం.శేషు నారాయణమూర్తి, వివేక్‌ భరద్వాజ్‌, సృజన్‌ జగన్నాథం, శ్రీరామ విజయశంకర్‌ ఉన్నారు. నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో రూ.36.9 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Shocking News: పోర్న్ సైట్లకు ఏపీ నుంచి వీడియోలు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు!

గుంటూరులో అశ్లీల వీడియోలు కలకలం రేపాయి. గుంతకల్‌లో కాల్ సెంటర్ పేరుతో శృంగార వీడియోలు తీసి పోర్న్‌ సైట్లకు సరఫరా చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. వీటితో పాటు లైవ్ షోస్‌ను కూడా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

New Update
PORN SITES

PORN SITES

పోర్న్ సైట్లకు ఏపీ నుంచి వీడియోలు సరఫరా చేస్తున్న ముఠాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా గుంతకల్‌కు చెందిన లూయిస్ కాల్ సెంటర్ నడుపుతున్నాడు. ఈ కాల్‌ సెంటర్‌లో పనిచేసే వారితో బలవంతంగా అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నాడు. ఈ వీడియోలను అశ్లీల వెబ్‌సైట్లకు సరఫరా చేస్తున్నారు. ఈ ముఠాను అరెస్టు చేసినట్లు ఈగల్, సైబర్ సెక్యూరిటీ ఐజి ఆకే రవి క్రిష్ణ తెలిపారు.

ఇది కూడా చూడండి: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

ఇది కూడా చూడండి: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేస్తూ..

కేవలం వీడియోలతో పాటు లైవ్ షోస్‌ను కూడా వెబ్‌సైట్లకు ఇస్తున్నట్లు గుర్తించారు. క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. సైప్రస్ దేశానికి చెందిన వారితో ఆన్‌లైన్ చెల్లింపులు చేస్తున్నారు. ఈ వీడియోలను నిషేధిత అశ్లీల వెబ్‌సైట్స్‌కు విక్రయించినట్లు గుర్తించారు. దీంతో గుంతకల్‌కు చెందిన లూయిస్, శ్రీకాకుళంకు చెందిన గణేష్, జ్యోత్స్నలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఇంకా ఉంది. 

ఇది కూడా చూడండి: Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు