Teacher Murder: కర్ణాటకలో టీచర్ దీపిక హత్య వెనుక సంచలన నిజాలు

కర్ణాటకలో టీచర్‌గా పనిచేస్తున్న దీపిక హత్య సంచలనంగా మారింది. ఆమెకి పరిచయమున్న యువకుడు నితిన్ అక్కా అని పిలుస్తూనే ఈ దారుణానికి ఒడిగట్టాడని ప్రాధమిక దర్యాప్తులో తేలింది.వీరిద్దరి మధ్య గొడవకు దారితీసిన పరిస్థితులేంటి అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు

New Update
Teacher Murder: కర్ణాటకలో టీచర్ దీపిక హత్య వెనుక సంచలన నిజాలు
Karnataka Teacher Murder : కర్ణాటక మాండ్యలో దారుణం జరిగింది. అదృశ్యమైన మూడ్రోజుల తర్వాత శవమై కనిపించింది టీచర్‌ దీపిక (Deepika). ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఓ దుండగుడు. ఈ కేసులో షాకింగ్‌ నిజాలు వెలుగులోకొస్తున్నాయి. దీపికకు పరిచయమున్న ఓ యువకుడు..అక్కా అని పిలుస్తూనే ఇంతటి ఘాతుకానికి తెగబడ్డాడని గుండెలు పగిలేలా రోదిస్తున్నారు ఆమె భర్త, కుటుంబసభ్యులు.
స్కూటీపై స్కూల్‌కు వెళ్లిన దీపిక ఏమైంది ? 
మాణిక్యనహళ్లికి చెందిన దీపిక..అదే గ్రామానికి చెందిన లోకేష్‌కు కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. వారికి 8ఏళ్ల పాప కూడా ఉంది. దీపిక మేలుకోటేలో టీచర్‌గా పనిచేస్తూనే ఇన్‌స్టాలో రీల్స్‌ చేస్తూ ఫేమస్‌ అయింది. ఐతే ఈ నెల 20న స్కూటీపై స్కూల్‌కు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి రాలేదు. దీంతో దీపిక కోసం వెతికిన కుటుంబసభ్యులు..ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు కంప్లైంట్‌ చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలించారు. ఐతే మేలుకోటే యోగనరసింహస్వామి కొండ దిగువన ఆమె స్కూటీ కనిపించడంతో..ఆ పరిసర ప్రాంతాల్లో వెతగ్గా అక్కడ దుర్వాసన వస్తుండటంతో మట్టిని తొలగించి చూశారు. అక్కడ టీచర్‌ దీపిక డెడ్‌బాడీ లభ్యమైంది.
టీచర్ దీపిక ఫోన్లో వీడియోలో ఏముంది ?
ఘటనాస్థలంలో దొరికిన దీపిక ఫోన్‌లో నితిన్‌తో గొడవ పడుతున్న ఓ వీడియో బయటికొచ్చింది. దీంతో అతనే తన భార్య దీపికను హత్య చేశాడని ఆరోపిస్తున్నాడు భర్త. అక్కా అని పిలుస్తూనే హత్య చేశాడని కన్నీటిపర్యంతమవుతున్నాడు. నితిన్ తండ్రిని అదుపులోకి తీసుకుని విచారించగా..చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయ్ అని, తన కోసం వెతకొద్దని మెసేజ్‌ చేసినట్టు తెలుస్తోంది. భర్త అనుమానానికి తోడు.. నితిన్‌ హత్య జరిగిన రోజు నుంచి కనిపించకుండా పోవడంతో..అతనే ఈ మర్డర్‌ చేసి ఉంటాడని భావిస్తున్నారు పోలీసులు. మరోవైపు టీచర్‌ దీపికకు ఫోన్‌ చేసిన చివరి వ్యక్తి కూడా నితినే కావడంతో..అతని కోసం గాలించిన పోలీసులు..అతన్ని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.
పథకం ప్రకారమే హత్య !
ముందుగా వేసుకున్న ప్లాన్‌ ప్రకారమే నితిన్‌ దీపికను ఓ రహస్య ప్రాంతానికి పిలిచి ఆమెతో గొడవపడ్డాడని..ఆ తర్వాత ఆమె గొంతు నులిమి చంపి..గోతిలో పూడ్చిపెట్టి పరారయ్యాడని నిర్థారణకొచ్చారు పోలీసులు. అక్కా అంటూ తిరిగే నితిన్‌.. దీపికాను ఎందుకు హత్య చేశాడని ఆరా తీస్తున్నట్టు తెలిపారు. అయితే ఇందులో నితిన్ ఒక్కడే ఉన్నాడా.. ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తన భార్యను అత్యంత దారుణంగా చంపిన నిందితుడికి జీవిత ఖైదు విధించాలని డిమాండ్ చేస్తున్నాడు దీపిక భర్త.

Advertisment
Advertisment
తాజా కథనాలు