UP Encounter : యూపీలో సంచలన ఎన్ కౌంటర్... మాఫియా డాన్ హతం..!!

యూపీ మాఫీయా గ్యాంగ్ స్టర్ వినోద్ ఉపాధ్యాయ్ ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. ఇతనిపై రూ. 1లక్ష రివార్డు కూడా ఉంది. సుల్తాన్‌పూర్ జిల్లాలోని కొత్వాలి ప్రాంతంలో వినోద్ ఉపాధ్యాయ్, యూపీ ఎస్‌టిఎఫ్ మధ్య ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో వినోద్ ఉపాధ్యాయ్ హతమైనట్లు పోలీసులు తెలిపారు.

New Update
UP Encounter : యూపీలో సంచలన ఎన్ కౌంటర్... మాఫియా డాన్ హతం..!!

Vinod Upadhyay : ఉత్తరప్రదేశ్‌ పోలీస్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌(Uttar Pradesh Police Special Task Force) గ్యాంగ్ స్టర్ వినోద్ ఉపాధ్యాయ్ ను మట్టుబెట్టింది. రాష్ట్రంలో పేరు మోసిన మాఫియా వినోద్ ఉపాధ్యాయ్‌ను యూపీ ఎస్టీఎఫ్(UP STF) ఎన్‌కౌంటర్‌లో హతమార్చింది. ఉపాధ్యాయపై రూ.లక్ష రివార్డు, పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. నివేదికల ప్రకారం, వినోద్ ఉపాధ్యాయ్ ఉత్తరప్రదేశ్‌లోని పేరుమోపిన మాఫియా డాన్(Mafia Don). రాష్ట్రంలోని టాప్-61 మాఫియాల జాబితాలో అతని పేరు చేరింది. ఉపాధ్యాయ్ అయోధ్య(Ayodhya) జిల్లాలోని మాయాబజార్ నివాసి. అతనిపై దాదాపు 3 డజన్ల క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

నేరాల ప్రపంచంలో ప్రకంపనలు:
సుల్తాన్‌పూర్ జిల్లా(Sultanpur District) లోని కొత్వాలి ప్రాంతంలో వినోద్ ఉపాధ్యాయ్(Vinod Upadhyay), యూపీ ఎస్‌టిఎఫ్ మధ్య ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. కాల్పుల్లో వినోద్‌కు గాయాలయ్యాయని, ఆ తర్వాత ఆస్పత్రికి తరలించారని చెబుతున్నారు. ఆసుపత్రికి చేరుకోగానే వినోద్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఖచ్చితమైన లక్ష్యంతో ప్రసిద్ధి చెందిన వినోద్ ఉపాధ్యాయ్ నేరాల ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించాడు.వినోద్ ఉపాధ్యాయ్ ఎన్ కౌంటర్లో మరణించినట్లు తెలియగానే ఆయన బాధితులు సంబురాలు చేసుకుంటున్నారు. వినోద్ సొంతంగా వ్యవస్థీకృత ముఠాగా ఏర్పడి గోరఖ్‌పూర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, లక్నో జిల్లాల్లో పలు సంచలన హత్యలకు పాల్పడ్డాడు.

ఇది కూడా చదవండి: అర్థరాత్రి ఘోరరోడ్డు ప్రమాదం..ఎమ్మెల్సీ కారుకు యాక్సిడెంట్..పీఏ మృతి..!!

మాఫియా వినోద్ నుంచి స్టెన్ గన్ స్వాధీనం:
కరుడుగట్టిన మాఫియా డాన్ వినోద్‌తో జరిగిన ఎన్‌కౌంటర్ సమయంలో STF బృందానికి DSP దీపక్ సింగ్ నాయకత్వం వహించారు. ఎన్‌కౌంటర్ తర్వాత, 30 బోర్ చైనీస్ కంపెనీ పిస్టల్, 9 ఎంఎం ఫ్యాక్టరీ తయారు చేసిన స్టెన్ గన్‌తో పాటు లైవ్, ఖాళీ కాట్రిడ్జ్‌లను కూడా మాఫియా నుండి స్వాధీనం చేసుకున్నారు. మాఫియా స్విఫ్ట్ కారును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గ్యాంగ్ స్టర్ల గుండెల్లో సీఎం యోగి భయం: 

యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్(UP CM Yogi Adityanath).. రాష్ట్రంలో రౌడీషీటర్ల మాటే రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. యోగి అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పిన విధంగా యూపీలో మాఫియాను ఏరివేస్తున్నారు. లతీఫ్ ఎన్ కౌంటర్ తర్వాత యూపీలో ప్రశాంత వాతావరణం నెలకొంది. చోటా మోటా మాఫీయా డాన్ల భరతం కూడా పడుతున్నారు సీఎం యోగి ఆధిత్య నాథ్. ఇప్పటివరకు పదుల సంఖ్యలో రౌడీ షీటర్లను యూపీ పోలీసులు హతమార్చారు. వీరిపై పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. తాజాగా కరడుగట్టి మాఫీయా డాన్ వినోద్ ఉపాధ్యాయ్ ఎన్ కౌంటర్ తో యూపీ మరోసారి వార్తల్లో నిలిచింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు