Shobhana : 'కల్కి' నుంచి సీనియర్ నటి శోభన ఫస్ట్ లుక్ రిలీజ్.. ప్రభాస్ సినిమాతో రీ ఎంట్రీ..!

'కల్కి 2898AD' మూవీలోసీనియర్ నటి శోభన ఓ కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.ఈ పోస్ట‌ర్ కింద ఆమె పూర్వీకులు కూడా ఆమె లాగే వేచి ఉన్నారు అంటూ రాసుకోచ్చింది. ఇక ఈ మూవీలో 'మరియం' అనే పాత్ర‌లో శోభ‌న న‌టించ‌బోతుంది.

New Update
Shobhana : 'కల్కి' నుంచి సీనియర్ నటి శోభన ఫస్ట్ లుక్ రిలీజ్.. ప్రభాస్ సినిమాతో రీ ఎంట్రీ..!

Senior Actress Shobana First Look From Kalki 2898 : తెలుగులో ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా వెలుగొందిన శోభన.. మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. అది కూడా ప్రభాస్ (Prabhas) లాంటి పాన్ ఇండియా హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి 2898AD' మూవీలోసీనియర్ నటి శోభన ఓ కీలక పాత్ర పోషిస్తోంది.

తాజాగా సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.ఈ పోస్ట‌ర్ కింద ఆమె పూర్వీకులు కూడా ఆమె లాగే వేచి ఉన్నారు అంటూ రాసుకోచ్చింది. ఇక ఈ మూవీలో 'మరియం' అనే పాత్ర‌లో శోభ‌న న‌టించ‌బోతుంది. పోస్టర్ ను బట్టి చూస్తే శోభనకు ఇందులో ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : రజినీకాంత్ సినిమాలో నటించి తప్పు చేశా.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

వైజయంతి మూవీస్ బ్యాన‌ర్‌పై (Vyjayanthi Films) అశ్విన్ దత్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనె, దిశా పాటని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, రాజేంద్ర ప్రసాద్, దుల్కర్ సల్మాన్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ సినిమా జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack-Tollywood: క్షమించరాని క్రూరమైన చర్య..ఉగ్రదాడిని ఖండించిన సినీ ప్రముఖులు!

పహల్గాం ఉగ్రదాడి పై టాలీవుడ్‌ ప్రముఖులు స్పందించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు.మెగాస్టార్‌ చిరంజీవితో పాటు, తారక్‌,చరణ్‌, బన్నీ వంటి వారు సోషల్‌ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేశారు.

New Update
tollywood

tollywood

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం లో జరిగిన ఉగ్రదాడి యావత్ భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కశ్మీర్ అందాలు చూడడానికి వచ్చిన పర్యాటకుల మీద ఉగ్రవాదులు మారణకాండకు తెగబడ్డారు. ప్రజల మీద పాశవికంగా దాడి చేశారు. ఆ ఘటనలో మొత్తం 28 మంది మరణించారు. ఈ విషాదం పట్ల  టాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ సంతాపాన్ని తెలియజేశారు.

''పహల్గం లో 26 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న ఉగ్రదాడి‌ అత్యంత దారుణమైన చర్య. ఇది క్షమించరాని క్రూరమైన చర్య. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. వారికి కలిగిన నష్టం ఎవరూ పూడ్చలేనిది'' అని చిరంజీవి పేర్కొన్నారు. 

''పహల్గాం బాధితులను చూస్తుంటే నా గుండె బరువెక్కి పోతుంది. ఈ దాడిలో మరణించిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

'పహల్గాం టెర్రర్ ఎటాక్ వార్త విని షాక్ అయ్యాను. ఎంతో బాధ కలిగింది. ఈ తరహా ఘటనలకు మన సమాజంలో చోటు లేదు. దీనిని ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండించాలి. బాధిత కుటుంబాల కోసం ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను'' అని రామ్ చరణ్ పేర్కొన్నారు.

''పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ వార్త విని నా హృదయం ముక్కలైంది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా'' అని అల్లు అర్జున్ పోస్టు చేశారు. సాయి దుర్గా తేజ్, విష్ణు మంచు సహా పలువురు తెలుగు సినిమా ప్రముఖులు...‌‌ బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, సంజయ్ దత్, జాన్వీ కపూర్, సోనూ సూద్ తదితరులు ఈ దాడిని ఖండించారు.

Also Read: Pahalgam terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన పుతిన్..!

Also Read: Pahalgam Attack: ప్రధాని టూర్ లో..జేడీ వాన్స్ ఇండియాలో..ముంబై తరహాలో ఉగ్రదాడి..టార్గెట్ ఎవరు?

tollywood | Pahalgam attack | latest-news | jr-ntr | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు