Kalki 2898 AD: ప్రభాస్ తో ఆయన.. మొదటిసారిగా.. కల్కి నుంచి సూపర్ అప్ డేట్!

రెబల్ స్టార్ ప్రభాస్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా కల్కి' 2898 AD. అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి నటులు నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కూడా కీలకపాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. 

New Update
Kalki First Review : కల్కి.. మొదటి  రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే.. 

Kalki 2898 AD Update: రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమా అంటేనే పాన్ ఇండియా సినిమా.. భారీ బడ్జెట్ సినిమా.. ఇది ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇప్పుడు సలార్ తరువాత ప్రభాస్ కల్కి 2898 AD అనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా.  ఇక ఈ సినిమా షూట్ మొదలైనప్పటి నుంచి  బయటకొస్తున్న  అప్ డేట్స్ అందర్నీ పిచ్చెక్కిస్తున్నాయి. సినిమా కాస్టింగ్ గురించి తెలుస్తున్నకొద్దీ అందరికీ షాకింగ్ గా ఉంటోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ ఇప్పటివరకూ సినిమా(Kalki 2898 AD)లో చేస్తున్నారు అని చెప్పారు. వీళ్ళు మాత్రమే కాదు.. నాని (Hero Nani), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కూడా అతిధి పాత్రల్లో కనిపించనున్నారనే వార్త ఈ మధ్య వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో మరో స్టార్ యాక్టర్ కనిపిస్తారని చెబుతున్నారు. టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న ఆ వార్త ప్రకారం ఆ స్టార్ యాక్టర్ ఇంతకు ముందు ఎప్పుడూ ప్రభాస్ సినిమాల్లో కనిపించలేదు. మరి ఆ యాక్టర్ ఎవరు? తెలుసుకుందాం.. 

కల్కి సినిమా కాస్టింగ్ చూస్తే... మతిపోవడం ఖాయం. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin).. ప్రభాస్ తో జతకట్టి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బిగ్ బి, కమల్ హాసన్, దీపిక (Deepika Padukone) వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా (Kalki 2898 ad)సంచలనం సృష్టిస్తుందని అందరూ భావిస్తున్నారు. పైగా, సినిమా టైటిల్ కూడా విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. కాగా, కల్కి సినిమా మే 9న ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ దండయాత్రకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో కల్కి సినిమాలో మరో స్టార్ యాక్టర్ యాడ్ అయ్యారనే వార్త వైరల్ గా మారింది.

Also Read: ఓటీటీలోనూ ఆ బొమ్మ హిట్టే.. ఆహాలో ప్రస్తుతం ఆ సినిమా బ్యాండే మోగుతోంది!

ఇదిలా ఉంటే, ఈ సినిమా లో నటకిరీటి.. కామెడీ కింగ్ రాజేంద్ర ప్రసాద్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే రాజేంద్ర ప్రసాద్ కూడా హింట్ ఇచ్చారని చెబుతున్నారు. దీంతో కల్కిలో రాజేంద్రప్రసాద్ కూడా కనిపిస్తారని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది నిజం అయితే, ప్రభాస్ తో కలిసి రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) నటిస్తున్న మొదటి సినిమా ఇదే కానుంది. ఇక,  కల్కి సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఒక పక్క షూటింగ్.. మరో పక్క గ్రాఫిక్ వర్క్స్ శరవేగంగా చేసుకుంటూ వస్తున్నారు మేకర్స్. అనుకున్న తేదీకి విడుదల చేయాలనే.. గట్టి సంకల్పంతోనే మేకర్స్ ఉన్నారని చెబుతున్నారు. 

ఇదిలా ఉంటే.. ఈ సినిమా లో హీరోయిన్ గా కనిపించనున్న దీపికా పదుకోణె ఇటీవల గర్భవతి అయిన విషయం తెలిసిందే. దీంతో సినిమా షూటింగ్ కు ఏదైనా అంతరాయం కలుగుతుందా? అనే అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. అయితే, దీపికా షూటింగ్ పార్ట్ ఇప్పటికే పూర్తి అయిందనీ.. కేవలం డబ్బింగ్ మాత్రమే మిగిలి ఉందనీ అంటున్నారు. అందువల్ల టెన్షన్ అవసరం లేదని మేకర్స్ అంటున్నారు. 

Watch Kalki Release Date Teaser Here:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Jaat Collections: వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందిన "జాట్" సినిమా వీకెండ్‌కు బాక్సాఫీస్ వద్ద జోష్ పెంచింది. ఇండియా వైడ్ రూ.40 కోట్లు, వరల్డ్‌వైడ్ రూ.49.3 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో మైత్రి మూవీ మేకర్స్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

New Update
Jaat Collections

Jaat Collections

Jaat Collections: సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందిన "జాట్" సినిమా వీకెండ్‌కు బాక్సాఫీస్ వద్ద జోష్ పెంచింది. ఇండియా వైడ్ రూ.40 కోట్లు, వరల్డ్‌వైడ్ రూ.49.3 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో మైత్రి మూవీ మేకర్స్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ తొలిసారి టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించిన చిత్రం "జాట్", మాస్ ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చేలా థియేటర్లలో సందడి చేస్తోంది. సన్నీ డియోల్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి గోపీచంద్ మాస్ టేకింగ్ మిక్స్ కావడంతో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది.

రిలీజ్ రోజు ప్రపంచవ్యాప్తంగా కొద్దిగ నెమ్మదిగా వసూళ్లు మొదలైనా, వీకెండ్‌కి బాక్సాఫీస్ వద్ద సినిమా వేగంగా పరుగులు పెట్టింది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో వసూళ్లు గణనీయంగా పెరిగాయి.

Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని

ప్రపంచవ్యాప్తంగా రూ. 49.3 కోట్ల నెట్

తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా రూ. 40 కోట్ల మార్క్‌ను దాటి, ప్రపంచవ్యాప్తంగా రూ. 49.3 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సినిమాకి సాలిడ్ వీకెండ్ ఓపెనింగ్ వచ్చిందని చెప్పొచ్చు.

Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..

ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా, రణదీప్ హూడా విలన్‌గా కనిపించారు. మరో విశేషం ఏమిటంటే – ఈ ప్రాజెక్ట్ ద్వారా మైత్రి మూవీ మేకర్స్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.  మొత్తానికి "జాట్" బాక్సాఫీస్ వద్ద మెల్లగా మొదలై, వారం చివరికి భారీ వసూళ్లతో హిట్ మూవీగా నిలిచింది.

Also Read: ‘కేజీఎఫ్‌ చాప్టర్‌-2’: రాఖీ భాయ్ విధ్వంసానికి మూడేళ్లు!

Advertisment
Advertisment
Advertisment