Seema Haider: భారత్ - పాకిస్థాన్ మధ్య ఆమె ఉంది..! స్టూడెంట్ ఫన్నీ ఆన్సర్.. మరోసారి ట్రెండింగ్‌లో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్ జరుగుతోంది.. భారత్ - పాక్ సరిహద్దు, పొడవు గురించిన ప్రశ్న అడిగారు. దానికో స్టూడెంట్ అవాక్కయ్యే జవాబు రాశాడు. భారత్-పాకిస్థాన్ సరిహద్దు ‘సీమా హైదర్’ అని, పొడవు ఐదడుగుల ఆరంగుళాలని రాశాడు మనోడు. రెండు దేశాల మధ్య సీమా హైదర్ ఉందంటూ రాసుకొచ్చాడు. By Naren Kumar 23 Dec 2023 in నేషనల్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Seema Haider: ప్రేమకు హద్దుల్లేవంటూ సరిహద్దులనూ దాటి వచ్చిందామె. కుటుంబాన్ని వీడి కట్టుబట్టలతో పిల్లలను వెంటేసుకుని తన దేశాన్ని వీడింది. సీమా హైదర్ గుర్తుంది కదా.. సోషల్ మీడియాలో చిగురించిన తన ప్రేమను సొంతం చేసుకోవాలని పాకిస్థాన్ ను వదిలి భారత్ లో వాలిన ఆమె లవ్ స్టోరీ అప్పట్లో దేశమంతా హాట్ టాపిక్ అయ్యింది. అయితే, ఇప్పుడో స్టూడెంట్ ఆమెనే రెండు దేశాలకూ సరిహద్దును చేశాడు. అదెలా అంటే... పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్ జరుగుతోంది.. పరీక్షలో భారత్ - పాక్ సరిహద్దు, పొడవు గురించిన ప్రశ్న అడిగారు. దానికో స్టూడెంట్ అవాక్కయ్యేలా జవాబు రాశాడు. భారత్ - పాకిస్థాన్ సరిహద్దు ‘సీమా హైదర్’ అని, పొడవు ఐదడుగుల ఆరంగుళాలని రాశాడు మనోడు. రెండు దేశాల మధ్య సీమా హైదర్ ఉందంటూ రాసుకొచ్చాడు. అది చదివి షాక్ నుంచి తేరుకోవడానికి ఆ టీచర్ కు చాలా టైమే పట్టిందట. దాన్ని ఓ ఫొటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే.. విపరీతంగా షేర్ చేస్తున్నారట జనాలు. రాజస్థాన్ ధోల్‌పూర్ ప్రాంతంలో ఓ స్కూల్ లో జరిగిందిది. ఇది కూడా చదవండి: జైలు నుంచి విడుదల అయిన రైతుబిడ్డ..మళ్ళీ అదే రచ్చ చేసిన ఫ్యాన్స్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్‌కు ఫేస్‌బుక్‌లో పరిచయమై, అది కాస్తా ప్రేమగా మారి, భర్తను వీడి పిల్లలతో సహా నేపాల్ మీదుగా భారత్‌లోకి వచ్చింది సీమా. ప్రియడు సచిన్‌ను పెళ్లి చేసుకుని అతడితో కలిసి ఉంటున్నారు. ఈ మధ్యే ‘కార్వా చౌత్’ పండుగలో కూడా పాల్గొన్నారు. మరోవైపు సీమా గూఢచారేమో అన్న అనుమానాలూ కొందరు వ్యక్తపరిచారు. నిఘా సంస్థలూ దీనిపై దృష్టిపెట్టాయి. సరిహద్దు కాకపోయినా, రెండు దేశాల మధ్య వైరానికి అతీతమైన ‘ప్రేమ వారధి’గా మాత్రం సీమా నిలిచిందంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. #seema-haider #student-funny-answer మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి