Sea Spider: కాళ్లతో శ్వాస తీసుకోవచ్చా..ఇదెక్కడి విడ్డూరం!

పసుపు రంగులో ఉండే ఆస్ట్రోపాలీన్‌ హలానిచి అనే స్పైడర్‌ అంటార్కిటికా సముద్రంలో ఉంటుంది. ఈ జీవులు కాళ్ల ద్వారా శ్వాసను తీసుకోవడం చూసి శాస్త్రవేత్తలు నివ్వెరపోయారు. అంతేకాకుండా కాళ్లకు బాక్సింగ్ గ్లౌజుల్లా ఉండే కవచాలు కూడా ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు.

New Update
Sea Spider: కాళ్లతో శ్వాస తీసుకోవచ్చా..ఇదెక్కడి విడ్డూరం!

ప్రపంచంలో ఎన్నో జీవరాసులు ఉన్నాయి. ఒక్కో జీవి జీర్ణక్రియ, అలవాట్లు ఒక్కోలా ఉంటాయి. ఎప్పటికప్పుడు వెలుగుచూస్తున్న శాస్త్రవేత్తల పరిశోధనలు, అధ్యయనాలు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. తాజాగా మిచిగాన్‌ వర్సిటీకి చెందిన జీవశాస్త్రవేత్త కొత్త విషయాన్ని కనుగొన్నారు. ఆండ్రూ మహోన్‌ వారి టీమ్‌తో కలిసి కొత్త జాతికి చెందిన సముద్రపు సాలీడును కనిపెట్టారు. పసుపు రంగులో ఉండే ఈ స్పైడర్‌ అంటార్కిటికా సముద్రంలో ఉంటుందని అంటున్నారు.

అయితే.. ఇవి అన్ని జీవుల్లా ఇవి ఆహారాన్ని నోటి ద్వారా తీసుకోవని చెబుతున్నారు. గడ్డిలాంటి ప్రోబోస్సిస్‌ను తినేందుకు వాటి గోర్లకు బాక్సింగ్‌ గ్లౌజ్‌లాంటివి ఉపయోగిస్తాయని అంటున్నారు. అంతేకాకుండా శ్వాసను కూడా ఈ జీవులు కాళ్ల ద్వారానే తీసుకోవడం చూసి శాస్త్రవేత్తలు నివ్వెరపోయారు. ప్రపంచం మొత్తంలో ఇలాంటి భిన్నమైన సముద్రపు సాలీడు జాతులు వెయ్యికిపైగా ఉంటాయని సైంటిస్టులు అంటున్నారు. ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ఈ స్పైడర్ల పేరును ఆస్ట్రోపాలీన్‌ హలానిచి అని చెబుతున్నారు.

ఈ జీవులు సముద్రంలో గుర్రపుడెక్క ఎండ్రకాయలతో పాటు అరాక్నిడ్‌లకు దూరంగా జీవిస్తాయని పేర్కొన్నారు. అయితే శాస్త్రవేత్తలు కొత్తగా కనిపెట్టిన ఈ సాలీడు జాతుల్లో హలానిచితో పాటు రాస్ అనే జాతులు సముద్రపు అడుగుభాగం నుంచి ఉపరితలం వరకు 1,870 అడుగుల దూరంలోపల సంచరిస్తుంటాయని అంటున్నారు. వీటి శరీరం ఒక సెంటీమీటర్‌, కాళ్లు 3 సెంటీమీటర్లు ఉంటాయని, అంతేకాకుండా కాళ్లకు బాక్సింగ్ గ్లౌజుల్లా ఉండే కవచాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఇవి పురుగులను ఆహారంగా తీసుకునేప్పుడు ఉపయోగకరంగా ఉంటాయని, అంతేకాకుండా పట్టుకోవడానికి కూడా సౌలభ్యంగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: వేడినీటి స్నానంతో డిప్రెషన్‌కు చెక్‌ పెట్టొచ్చా..?

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు