నేషనల్ జాతీయజెండా ఎగరేసి స్పృహతప్పి పడిపోయిన మంత్రి దేశవ్యాప్తంగా నేడు (AUG-15) స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పలు విద్యాసంస్థలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు ఈ వేడుకల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా దేశంలోని పలు వీధుల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కానీ మధ్యప్రదేశ్‌లో మాత్రం అపశృతి చోటుచేసుకుంది. జాతీయజెండాను ఎగురవేసి ఓ మంత్రి కుప్పకూలిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. By Shareef Pasha 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling TS EAMCET Counselling: ఈనెల 17 నుంచి ఎంసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వినర్ కోటా కింద 83,766 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. అందులో కంప్యూటర్ సైన్స్ (CSE) కోర్సులే 56,811 ఉన్నాయి. దీంతో కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసినప్పటికి ఆగస్టు 17 నుంచి ఎంసెట్ స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. By Shareef Pasha 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News: మార్నింగ్ వాకింగ్ చేస్తున్న వ్యక్తిపై కత్తులతో దాడి!! కృష్ణా జిల్లా పెడనలో ఓ వ్యక్తి పై ఇద్దరు వ్యక్తులు కత్తులతో దారుణంగా దాడి చేశారు. కప్పల దొడ్డికి చెందిన పంతం బలరాం అనే వ్యక్తి మంగళవారం ఉదయం రోజూ లాగే మార్నింగ్ వాకింగ్ చేస్తున్నాడు. ఇంతలో ఇద్దరు యువకులు అకస్మాత్తుగా వచ్చి బలరాంపై కత్తులతో దాడికి దిగారు. దీంతో తీవ్ర గాయాల పాలైన బలరం అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న బలరాంను స్థానికులు మచిలీ పట్నలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం బలరాం నుంచి పోలీసులు వివరాలను సేకరించారు. తనపై యర్రా దేవన్, యర్రా జీవన్ లు కలిసి కత్తులతో దాడికి పాల్పడ్డాడని బలరాం వెల్లడించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. By E. Chinni 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పంద్రాగష్టు వేడుకల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రం.. నాటి స్వాతంత్ర్య సమరయోధుల పోరాట ఫలితమే అని పేర్కొన్నారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. మంగళవారం 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా నేల పాడులోని హైకోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. వివిధ మతాలు, వర్గాలు ఉన్నప్పటికీ అందరూ కలిసి స్వాతంత్య్రం కోసం ఏకతాటిపై పోరాడటం వల్లే బ్రిటీష్ వాళ్లను తరిమికొట్టామన్నారు. దేశ సరిహద్దుల్లో సైనికులు నిత్యం పహారా కాస్తూ ఉండటం వల్లనే దేశ ప్రజలకు స్వేచ్ఛ కొనసాగుతుందన్నారు. బలమైన రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం కారణంగానే ప్రజాస్వామ్య పరిరక్షణ కాపాడుకుంటున్నామని.. ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. నిరక్షరాస్యత,పేదరికం, అవగాహన, చట్టాలు తెలియకపోవటం వల్ల చాలా మంది తమ హక్కుల్ని కాపాడుకోలేకపోతున్నారని చెప్పారు. ఆర్టికల్ 39 ప్రకారం అందరికీ న్యాయ సహాయం అందేలా చూడాలని చెప్పారు. By E. Chinni 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling భాగ్యనగరంలో మరో మణిహారం, ప్రారంభానికి సిద్ధమైన స్టీల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ విశాలమైన రోడ్లతో, ప్లై ఓవర్ బ్రిడ్జీలతో హైదరాబాద్ మహానగరం దినాదినాభివృద్ధి చెందుతుంది. అలా నగర సిగలో ఎన్నో కట్టడాలు అబ్బురపరుస్తున్నాయి. ఓ పక్క నూతనంగా నిర్మించిన సెక్రటేరియట్, మరోపక్క అంబేద్కర్ విగ్రహం. తాజాగా ఇదే కోవలోకి మరో మణిహారం అయినటువంటి ఇందిరాపార్కు - వీఎస్టీ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం వచ్చి చేరింది. ఈ కట్టడం హైదరాబాద్‌కే తలమానికంగా నిలువనుంది. By Shareef Pasha 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని.. యువకుడి ఇంటిపై తల్లిదండ్రుల దాడి ప్రకాశం జిల్లాలో దర్శి మండలం బొట్లపాలెంకి చెందిన ఓ యువకుడు.. అదే గ్రామానికి చెందిన బ్రహ్మారెడ్డి, అతని భార్య పుల్లమ్మ కూతురు గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోక పోవడంతో.. ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లి పోయి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు బ్రహ్మారెడ్డి, పుల్లమ్మ యువకుడి కుటుంబ సభ్యులకు దాడికి పాల్పడ్డారు. తల్లిని కొట్టి, ఆ తర్వాత సోదరి బట్టలు చింపి అమానుషంగా పెట్రోల్ పోసి.. చంపేస్తామని బెదిరించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై యువకుడి బంధువులు, స్థానికులు కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితులను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు నిందితులు బ్రహ్మారెడ్డి, అతని భార్య పుల్లమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యాయత్నం, కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. By E. Chinni 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: పంద్రాగష్టు వేడుకల్లో ఆసక్తికర ఘటన.. కింద పడిన మెడల్ తీసిన సీఎం జగన్ 77వ స్వాతంత్ర్య దినోత్స వేడుకలు అంబరాన్నంటాయి. దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్స వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా పంద్రాగష్టు వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో సీఎం జగన్ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు మెడల్స్ ప్రదానం చేశారు సీఎం. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులకు మెడల్స్ ప్రదాన సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గ్రే హౌండ్స్ కు చెందిన గౌరు నాయకుడుకు మెడల్ ప్రధానం చేశారు సీఎం జగన్. ఆ తర్వాత గౌరు నాయుడు సెల్యూట్ చేస్తుండగా బహుకరించిన మెడల్ కిందపడటంతో.. సీఎం జగన్ వెంటనే కింద పడిన మెడల్ ను తీసి మళ్లీ.. సంబంధిత వ్యక్తికి ప్రదానం చేశారు. దీంతో గౌరు నాయుడు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. By E. Chinni 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ JanaSena VeeraMahila : స్త్రీ అన్ని విధాలా దగాకి గురవుతుందనేది వాస్తవం: పవన్ కళ్యాణ్ ఆగష్టు 15 సందర్భంగా జనసేన వీర మహిళలతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం సమావేశమయ్యారు. ప్రజలందరికీ జనసేన పక్షాన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. మహానుభావులు, మేధావుల త్యాగాలతోనే స్వాతంత్రాన్ని సంపాదించుకున్నామని చెప్పారు. ఇటువంటి చరిత్రలు, మహానుభావులు త్యాగాలు అందరూ తెలుసుకోవాలని సూచించారు. అలాగే పేద, మధ్య తరగతి మహిళలు ఇంటికే పరిమితం కాకూడదని.. సమాజంలో తమ మేధస్సుతో రాణించాలని కోరుకుంటున్నాని చెప్పారు. తాము భవిష్యత్తులో మగువలకు సరైన స్థానం, రక్షణ కల్పిస్తామని చెప్పారు. అతని ఇంట్లో ఆడవాళ్లు, కుటుంబం ఉంది కదా అని గుర్తు చేశారు. స్త్రీల కట్టు, బొట్టును అవమానించినా ప్రభుత్వం పట్టించుకోదా అని... ఈ పాలకులకు రాజకీయమే ముఖ్యమా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలు, మహిళా కమీషన్ మాట్లాడదన్నారు. దిశ చట్టాలు, స్పందన పెట్టి ప్రయోజనం ఏమిటని నిలదీశారు. . సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, పొట్టి శ్రీరాములు వంటి వారి స్పూర్తి తో జనసేన బలంగా పోరాటాలు చేస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. By E. Chinni 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu and Pawan Kalyan : స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు, పవన్ రాష్ట్ర, దేశ ప్రజలకు 77వ స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) శుభాకాంక్షలు వెల్లడించారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu). ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగ ఫలం మన స్వాతంత్ర్య భారతమన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయ సాధనకు, అద్భుతమైన దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నానని తెలిపారు. అలాగే 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జనసేన పార్టీ ఘనంగా నిర్వహించింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఈ వేడుకలను నిర్వహించగా.. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఎగరవేశారు.జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు పార్టీ ప్రముఖ నాయకులు, పార్టీ శ్రేణులు, పార్టీ నేతలు జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. By E. Chinni 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn