అమెరికాలో కాల్పుల కలకలం... మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హతం..!!
అమెరికాలోని అట్లాంటా సమీపంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను పోలీసులు కాల్చిచంపారు. నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో భాగంగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.
అమెరికాలోని అట్లాంటా సమీపంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను పోలీసులు కాల్చిచంపారు. నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో భాగంగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.
ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో కార్లోస్ అల్కరాస్ సంచలన విజయం సాధించాడు. టైటిల్ పోరులో నోవాక్ జకోవిచ్‌పై ఈ స్పెయిన్ ఆటగాడు 1-6, 7-6, 6-1, 3-6, 6-4తో గెలిచాడు.
సినిమాలు, రాజకీయాలకు విడదీయలేని అనుబంధం ఉంది. ఎంతో మంది సినిమా స్టార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పనిచేశారు. మరికొంతమంది అయితే పార్టీలు పెట్టి సీఎంలు కూడా అయ్యారు. తాజాగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ నుంచి అభిషేక్ బచ్చన్ రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇన్ఫోసిస్ వ్యవస్థాప చైర్మన్ నారాయణమూర్తి దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం శ్రీవారికి బంగారు ఆభరణాలను టీటీడీ ఈవో ధర్మారెడ్డికి కానుకగా అందజేశారు. శేషవస్త్రంతో మూర్తి దంపతులను సత్కరించి, స్వామి వారికి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటాన్ని ఈవో బహుకరించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గాలు రెండుగా చీలిపోయాయి. ఈ క్రమంలో మంత్రికి వ్యతిరేకంగా బోస్ వర్గీయులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేశారు
సాధారణంగా కడుపులో రాళ్లు, కత్తెరలు, ప్లాస్టిక్ వస్తువులను సర్జరీ చేసి తీయడం వంటి వార్తలు వింటూ ఉంటాం. కానీ ఏపీలో మాత్రం ఓ అరుదైన ఆపరేషన్ చేశారు వైద్యులు. బాలుడి కడుపులో ఆయస్కాంతాలు ఉండటం చూసి షాకయ్యారు. అయితే వాటిని విజయవంతంగా ఆపరేషన్ చేసి తొలగించారు.
శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆమె తొడగొట్టి బెదిరిస్తున్న మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోజురోజుకు ఆమె ఆగడాలు ఎక్కువైపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉచిత విద్యుత్ అంశంలో తెలంగాణ అధికార పక్షం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా రైతులను దగా చేసిందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు కాంగ్రెస్ ఏనాడూ ఉచిత విద్యుత్ ఇవ్వలేదని స్పష్టం చేశారు.
నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ట్రాఫిక్ సమస్యలు తీరబోతున్నాయి. 2020లో చేపట్టిన స్టీల్ బ్రిడ్జ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఆగస్టు మొదటి వారంలో ప్రజలకు అందుబాటులోకి రానుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.